నిర్గమకాండము (Exodus) చాప్టర్ 1
1. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేరులు ఏవనగా, రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను బెన్యామీను.
2. దాను నఫ్తాలి గాదు ఆషేరు.
3. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను.
4. యాకోబు గర్భమున పుట్టినవారందరు డెబ్బదిమంది.
5. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను.
6. యోసేపును అతని అన్నదమ్ములందరును ఆ తరము వారంద రును చనిపోయిరి.
7. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి; వారున్న ప్రదేశము వారితో నిండి యుండెను.
8. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్తరాజు ఐగు ప్తును ఏల నారంభించెను.
9. అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇశ్రాయేలు సంతతియైన యీ జనము మనకంటె విస్తారముగాను బలిష్ఠముగాను ఉన్నది.
10. వారు విస్తరింప కుండునట్లు మనము వారియెడల యుక్తిగా జరిగించుదము రండి; లేనియెడల యుద్ధము కలుగునప్పుడుకూడ మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధముచేసి యీ దేశములోనుండి, వెళ్లిపోదురేమో అనెను.
11. కాబట్టి వారిమీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారిమీద నియ మింపగా వారు ఫరోకొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామెసేసను పట్టణములను కట్టిరి.
12. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టినకొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల యెడల అసహ్య పడిరి.
13. ఇశ్రాయేలీయులచేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి;
14. వారు ఇశ్రాయేలీయులచేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతిపనిలోను కఠినసేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి.
15. మరియు ఐగుప్తురాజు షిఫ్రా పూయా అను హెబ్రీ యుల మంత్రసానులతో మాటలాడి
16. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసానిపని చేయుచు వారిని కాన్పుపీటల మీద చూచినప్పుడు మగవాడైనయెడల వాని చంపుడి, ఆడుదైనయెడల దాని బ్రదుకనియ్యుడని వారితో చెప్పెను.
17. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఐగుప్తురాజు తమ కాజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రదుకనియ్యగా
18. ఐగుప్తురాజు ఆ మంత్ర సానులను పిలి పించిమీరెందుకు మగపిల్లలను బ్రదుకనిచ్చితిరి? ఈ పని యేల చేసితిరి అని అడిగెను.
19. అందుకు ఆ మంత్ర సానులుహెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలవంటివారు కారు; వారు చురుకైనవారు. మంత్రసాని వారియొద్దకు వెళ్లక మునుపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి.
20. దేవుడు ఆ మంత్ర సానులకు మేలుచేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను.
21. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను.
22. అయితే ఫరోహెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రదుకనియ్యుడి అని తన జనులందరికి ఆజ్ఞాపించెను.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 2
1. లేవి వంశస్థుడొకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహము చేసికొనెను.
2. ఆ స్త్రీ గర్భవతియై కుమారుని కని, వాడు సుందరుడై యుండుట చూచి మూడునెలలు వానిని దాచెను.
3. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ముపెట్టె తీసికొని, దానికి జిగటమన్నును కీలును పూసి, అందులో ఆ పిల్లవానిని పెట్టియేటియొడ్డున జమ్ములో దానిని ఉంచగా,
4. వానికేమి సంభవించునో తెలిసికొనుటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను.
5. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటియొడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి, తన పనికత్తె నొకతెను పంపి దాని తెప్పించి
6. తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వానియందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలలో నొకడనెను.
7. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీకొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను.
8. అందుకు ఫరో కుమార్తెవెళ్లుమని చెప్పగా ఆ చిన్నది వెళ్లి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను.
9. ఫరో కుమార్తె ఆమెతోఈ బిడ్డను తీసికొని పోయి నాకొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చెదనని చెప్పగా, ఆ స్త్రీ ఆ బిడ్డను తీసికొని పోయి పాలిచ్చి పెంచెను.
10. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసికొని వచ్చెను, అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమెనీటిలోనుండి ఇతని తీసితినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను.
11. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనులయొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను.
12. అతడు ఇటు అటు తిరిగి చూచి యెవడును లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి యిసుకలో వాని కప్పి పెట్టెను.
13. మరునాడు అతడు బయట నడిచి వెళ్లుచుండగా హెబ్రీయులైన మనుష్యులిద్దరు పోట్లాడుచుండిరి.
14. అప్పు డతడు అన్యాయము చేసినవాని చూచినీ వేల నీ పొరుగు వాని కొట్టుచున్నావని అడుగగా అతడుమామీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించినవాడె వడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్ల
15. ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచెనుగాని, మోషే ఫరో యెదుటనుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి యొక బావియొద్ద కూర్చుండెను.
16. మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా
17. మందకాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను.
18. వారు తమ తండ్రియైన రగూయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీ రింత త్వరగా ఎట్లు వచ్చితిరనెను.
19. అందుకు వారుఐగుప్తీయుడొకడు మందకాపరుల చేతిలోనుండి మమ్మును తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా
20. అతడు తన కుమార్తెలతొ అతడెక్కడ? ఆ మనుష్యుని ఏల విడిచి వచ్చితిరి? భోజనమునకు అతని పిలుచుకొని రండనెను.
21. మోషేఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తెయైన సిప్పోరాను మోషే కిచ్చెను.
22. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషేనేను అన్య దేశములో పర దేశినై యుంటిననుకొని వానికి గెర్షోము అనుపేరు పెట్టెను.
23. ఆలాగున అనేక దినములు జరిగినమీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయు చున్న వెట్టి పనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టు చుండగా, తమ వెట్టి పనులనుబట్టి వారుపెట్టిన మొర దేవునియొద్దకు చేరెను.
24. కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను.
25. దేవుడు ఇశ్రాయేలీ యులను చూచెను; దేవుడు వారియందు లక్ష్యముంచెను.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 3
1. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను.
2. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. గాని పొద కాలిపోలేదు.
3. అప్పుడు మోషేఆ పొద యేల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి యీ గొప్పవింత చూచెదననుకొనెను.
4. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమనుండిమోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడుచిత్తము ప్రభువా అనెను.
5. అందుకాయనదగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను.
6. మరియు ఆయననేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖ మును కప్పుకొని దేవునివైపు చూడ వెరచెను.
7. మరియు యెహోవా యిట్లనెనునేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి.
8. కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయు లకు హివ్వీయులకు యెబూసీయులకు నివాసస్థానమై, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించు టకును దిగివచ్చి యున్నాను.
9. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నాయొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారినిపెట్టు చున్న హింస చూచితిని.
10. కాగా రమ్ము, నిన్ను ఫరోయొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెననెను.
11. అందుకు మోషేనేను ఫరో యొద్దకు వెళ్లుటకును, ఇశ్రాయేలీయు లను ఐగుప్తు లోనుండి తోడుకొని పోవుటకును ఎంతటివాడ నని దేవునితో అనగా
12. ఆయననిశ్చయముగా నేను నీకు తోడై యుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన; నీవు ఆ ప్రజలను ఐగుప్తులోనుండి తోడు కొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతముమీద దేవుని సేవించెదరనెను.
13. మోషేచిత్తగించుము; నేను ఇశ్రాయేలీయులయొద్దకు వెళ్లి వారిని చూచిమీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారుఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నే నేమి చెప్పవలెనని దేవుని నడిగెను.
14. అందుకు దేవుడునేను ఉన్నవాడను అను వాడనైయున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయనఉండుననువాడు మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను.
15. మరియు దేవుడు మోషేతో నిట్లనెనుమీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము.
16. నీవు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసిమీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, నాకు ప్రత్యక్షమై యిట్లనెను నేను మిమ్మును, ఐగుప్తులో మీకు సంభవించిన దానిని, నిశ్చయముగా చూచితిని,
17. ఐగుప్తు బాధలోనుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, అనగా కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులున్న దేశమునకు మిమ్ము రప్పించెదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము.
18. వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలును ఐగుప్తు రాజు నొద్దకు వెళ్లి అతని చూచిహెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు మూడుదినముల ప్రయాణ మంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్ప వలెను.
19. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్ము పోనియ్యడని నేనెరుగుదును;
20. కాని, నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయ దలచియున్న నా అద్భు తములన్నిటిని చూపి దాని పాడుచేసెదను. అటుతరువాత అతడు మిమ్ము పంపివేయును.
21. జనుల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెదను గనుక మీరు వెళ్లునప్పుడు వట్టిచేతులతో వెళ్లరు.
22. ప్రతి స్త్రీయు తన పొరుగుదానిని తన యింటనుండు దానిని వెండి నగలను బంగారునగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసికొని, మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 4
1. అందుకు మోషేచిత్తగించుము; వారు నన్ను నమ్మరు నా మాట వినరుయెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా
2. యెహోవానీ చేతిలోనిది ఏమిటి అని అతని నడిగెను. అందుకతడుకఱ్ఱ అనెను.
3. అప్పుడాయన నేలను దాని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దానినుండి పారిపోయెను.
4. అప్పుడు యెహోవానీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా, అతడు తన చెయ్యి చాపి దాని పట్టు కొనగానే అది అతని చేతిలో కఱ్ఱ ఆయెను.
5. ఆయనదానిచేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్ష మాయెనని నమ్ముదురనెను.
6. మరియు యెహోవానీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొను మనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠముగలదై హిమమువలె తెల్లగా ఆయెను.
7. తరువాత ఆయననీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్మునుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరమువలె ఆయెను.
8. మరియు ఆయనవారు నిన్ను నమ్మక, మొదటి సూచననుబట్టి వినకపోయిన యెడల రెండవ దానిబట్టి విందురు.
9. వారు ఈ రెండు సూచనలనుబట్టి నమ్మక నీమాట వినకపోయిన యెడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి యెండిన నేలమీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలోనుండి తీసిన నీళ్లు పొడినేలమీద రక్తమగుననెను.
10. అప్పుడు మోషేప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడి నప్పటినుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహొ
11. యెహోవామానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగ వానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డి వానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా.
12. కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పెను.
13. అందుకతడు అయ్యో ప్రభువా, నీవు పంప తలంచిన వానినే పంపుమనగా
14. ఆయన మోషేమీద కోపపడిలేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేనెరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును;
15. నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడై యుండి, మీరు చేయ వలసినదానిని మీకు బోధించె దను.
16. అతడే నీకు బదులు జనులతో మాటలాడును, అతడే నీకు నోరుగానుండును, నీవు అతనికి దేవుడవుగా ఉందువు.
17. ఈ కఱ్ఱను చేతపట్టు కొనిదానితో ఆ సూచక క్రియలు చేయవలెననిచెప్పెను.
18. అటుతరువాత మోషే బయలుదేరి తన మామయైన యిత్రోయొద్దకు తిరిగి వెళ్లిసెలవైనయెడల నేను ఐగుప్తులోనున్న నా బంధువులయొద్దకు మరల పోయి వారింక సజీవులై యున్నారేమో చూచె
19. అంతట యెహోవానీ ప్రాణమును వెదకిన మనుష్యులందరు చనిపోయిరి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్లు మని మిద్యానులో మోషేతో చెప్పగా,
20. మోషే తన భార్యను తన కుమారులను తీసికొని గాడిదమీద నెక్కించు కొని ఐగుప్తుకు తిరిగి వెళ్లెను. మోషే దేవుని కఱ్ఱను తన చేత పట్టుకొని పోయెను.
21. అప్పుడు యెహోవామోషేతో ఇట్లనెనునీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత, చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యము లన్నియు ఫరో యెదుట చేయవలెను సుమీ అయితే నేను అతని హ
22. అప్పుడు నీవు ఫరోతోఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు;
23. నన్ను సేవించునట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించు చున్నాను; వాని పంప నొల్లనియెడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెల విచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను.
24. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా
25. సిప్పోరా వాడిగల రాయి తీసికొని తన కుమారునికి సున్నతిచేసి అతని పాదములయొద్ద అది పడవేసినిజముగా నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను; అంతట ఆయన అతనిని విడిచెను.
26. అప్పుడు ఆమెఈ సున్నతినిబట్టి నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను.
27. మరియు యెహోవామోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్లి దేవుని పర్వతమందు అతని కలిసికొని అతని ముద్దు పెట్టుకొనెను.
28. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటిని, ఆయన చేయనాజ్ఞాపించిన సూచక క్రియలన్నిటిని అహరోనుకు తెలిపెను.
29. తరువాత మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పోగుచేసి,
30. యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నియు అహరోను వివరించి, జనులయెదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమి్మరి.
31. మరియుయెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని తలవంచుకొని నమస్కారము చేసిరి.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 5
1. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోనుచూచిఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి.
2. ఫరోనేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయ ననెను.
3. అప్పుడు వారుహెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను, సెలవైన యెడల మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంత దూరముపోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుద
4. అందుకు ఐగుప్తు రాజుమోషే అహరోనూ, ఈ జనులు తమ పనులను చేయకుండ మీరేల ఆపు చున్నారు? మీ బరువులు మోయుటకు పొండనెను.
5. మరియు ఫరోఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించియున్నది; వారు తమ బరువులను విడిచి తీరికగా నుండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను.
6. ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను
7. ఇటుకలు చేయుటకు మీరు ఇకమీదట ఈ జనులకు గడ్డి ఇయ్య కూడదు, వారు వెళ్లి తామే గడ్డి కూర్చుకొనవలెను.
8. అయినను వారు ఇదివరకు చేసిన యిటుకల లెక్కనే వారి మీద మోపవలెను, దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు; వారు సోమరులు గనుకమేము వెళ్లి మా దేవునికి బలి నర్పించుటకు
9. ఆ మనుష్యులచేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు కష్టపడవలెను, అబద్ధపుమాటలను వారు లక్ష్యపెట్టకూడదనెను.
10. కాబట్టి ప్రజలు కార్య నియామకులును వారి నాయకులును పోయి ప్రజలను చూచినేను మీకు గడ్డి ఇయ్యను;
11. మీరు వెళ్లి మీకు గడ్డి యెక్కడ దొరకునో అక్కడ మీరే సంపాదించు కొనుడి, అయితే మీ పనిలో నేమాత్రమును తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చెననిరి.
12. అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్య కాలు కూర్చుటకు ఐగుప్తు దేశమం దంతటను చెదిరి పోయిరి.
13. మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటివలెనే యేనాటిపని ఆనాడే ముగించుడనిరి.
14. ఫరో కార్య నియామకులు తాము ఇశ్రాయేలీయులలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టిఎప్పటివలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఏల చేయించలేదని అడుగగా
15. ఇశ్రాయేలీయుల నాయకులు ఫరో యొద్దకు వచ్చితమ దాసుల యెడల తమ రెందుకిట్లు జరిగించుచున్నారు?
16. తమ దాసులకు గడ్డినియ్యరు అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు; చిత్తగించుము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు; అయితే తప్పిదము తమరి ప్రజలయందే యున్నదని మొఱపెట్టిరి.
17. అందుకతడుమీరు సోమరులు మీరు సోమరులు అందుచేత మేము వెళ్లి యెహోవాకు బలినర్పించుటకు సెలవిమ్మని మీరడుగు చున్నారు.
18. మీరు పొండి, పనిచేయుడి, గడ్డి మీకియ్య బడదు, అయితే ఇటుకల లెక్క మీరప్పగింపక తప్పదని చెప్పెను.
19. మీ ఇటుకల లెక్కలో నేమాత్రమును తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలెనని రాజు సెలవియ్యగా, ఇశ్రాయేలీయుల నాయకులు తాము దురవస్థలో పడియున్నట్లు తెలిసికొనిరి.
20. వారు ఫరో యొద్దనుండి బయలుదేరి వచ్చుచు, తమ్మును ఎదుర్కొను టకు దారిలో నిలిచియున్న మోషే అహరోనులను కలిసికొని
21. యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చును గాక; ఫరో యెదుటను అతని దాసుల యెదుటను మమ్మును అసహ్యులనుగా చేసి మమ్ము చంపుటకై వారిచేతికి ఖడ్గ మిచ్చితిరని వారితో అనగా
22. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లిప్రభువా, నీవేల ఈ ప్రజలకు కీడు చేసితివి? నన్నేల పంపితివి?
23. నేను నీ పేరట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటినుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడి పింపను లేదనెను.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 6
1. అందుకు యెహోవాఫరోకు నేను చేయబోవు చున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు; బలమైన హస్తముచేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశముల
2. మరియు దేవుడు మోషేతో ఇట్లనెనునేనే యెహోవాను;
3. నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు.
4. మరియు వారు పరవాసము చేసిన దేశ మగు కనానుదేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని.
5. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచియున్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకముచేసికొని యున్నాను.
6. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుమునేనే యెహోవాను; నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి, వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులుతీర్చి మిమ్మును విడిపించి,
7. మిమ్మును నాకు ప్రజ లగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రిందనుండి మిమ్మును వెలుపలికి రప్పిం చిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసి కొందురు.
8. నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చెదనని చెయ్యి యెత్తి ప్రమాణముచేసిన దేశము లోనికి మిమ్మును రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను; నేను యెహోవానని చెప్పుమనగా
9. మోషే ఇశ్రాయేలీయులతో ఆలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమునుబట్టియు కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట వినరైరి.
10. మరియు యెహోవా మోషేతోనీవు లోపలికి వెళ్లి,
11. ఐగుప్తురాజైన ఫరోతోఇశ్రాయేలీయులను తన దేశములోనుండి వెలుపలికి పోనియ్యవలెనని అతనితో చెప్పుమనెను.
12. అప్పుడు మోషేచిత్తగించుము, ఇశ్రా యేలీయులే నా మాట వినలేదు; మాటమాంద్యము గలవాడ నగు నా మాట ఫరో యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.
13. మరియు యెహోవా మోషే అహరోనులతో నిట్లనెను ఇశ్రా యేలీయులను ఐగుప్తు దేశములోనుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్ద కును ఫరో యొద్దకును వెళ్లవలెనని వారి కాజ్ఞాపించెను.
14. వారి పితరుల కుటుంబముల మూలపురుషులు ఎవరనగా, ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులుహనోకు పల్లు హెస్రోను కర్మీ; వీరు రూబేను కుటుంబములు.
15. షిమ్యోను కుమారులు యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనాను స్త్రీకి కుమారుడైన షావూలు; వీరు షిమ్యోను కుటుంబములు.
16. లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.
17. గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్నీ షిమీ.
18. కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రదికెను.
19. మెరారి కుమారులు మహలి మూషి; వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు.
20. అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెండ్లి చేసికొనెను; ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.
21. ఇస్హారు కుమారులు కోరహు నెపెగు జిఖ్రీ
22. ఉజ్జీయేలు కుమారులు మిషాయేలు ఎల్సాఫాను సిత్రీ.
23. అహరోను అమీ్మనాదాబు కుమార్తెయు నయస్సోను సహో దరియునైన ఎలీషెబను పెండ్లిచేసి కొనెను. ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును కనెను.
24. కోరహు కుమారులు అస్సీరు ఎల్కానా అబీయా సాపు; వీరు కోరహీయుల కుటుంబములు.
25. అహరోను కుమారుడైన ఎలియాజరు పూతీయేలు కుమార్తెలలో ఒకతెను పెండ్లిచేసికొనెను. ఆమె అతనికి ఫీనెహాసును కనెను; వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల వ
26. ఇశ్రాయేలీయులను వారి సేనల చొప్పున ఐగుప్తుదేశములోనుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు.
27. ఇశ్రాయేలీయలను ఐగుప్తులోనుండి వెలుపలికి రప్పించ వలెనని ఐగుప్తు రాజైన ఫరోతో మాటలాడిన వారు వీరు; ఆ మోషే అహరోనులు వీరే.
28. ఐగుప్తుదేశములో యెహోవా మోషేతో మాటలాడిన దినమున
29. యెహోవానేను యెహోవాను; నేను నీతో చెప్పునది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా
30. మోషేచిత్తగించుము; నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 7
1. కాగా యెహోవా మోషేతో ఇట్లనెనుఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని; నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును.
2. నేను నీ కాజ్ఞాపించునది యావత్తు నీవు పలుకవలెను. ఫరో తన దేశములోనుండి ఇశ్రాయేలీయులను పోనియ్యవలెనని నీ అన్నయైన అహరోను అతనితో చెప్పును;
3. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి, ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసెదను.
4. ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పులచేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెదను.
5. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రా యేలీయులను వారి మధ్యనుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను.
6. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, ఆలాగుననే చేసిరి.
7. వారు ఫరోతో మాటలాడినప్పుడు మోషేకు ఎనుబదియేండ్లు, అహరోనుకు ఎనుబది మూడు ఏండ్లు.
8. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెనుఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనుపరచుడని మీతో చెప్పునప్పుడు
9. నీవు అహరోనును చూచినీ కఱ్ఱను పట్టుకొని ఫరో యెదుట దాని పడ వేయుమనుము; అది సర్పమగును.
10. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి యెహోవా తమ కాజ్ఞా పించినట్లు చేసిరి. అహరోను ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కఱ్ఱను పడవేయగానే అది సర్ప మాయెను.
11. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రుకూడ తమ మంత్రములచేత ఆలాగే చేసిరి.
12. వారిలో ప్రతివాడును తన కఱ్ఱను పడవేసినప్పుడు అది సర్పమాయెనుగాని అహ రోను కఱ్ఱ వారి కఱ్ఱలను మింగివేయగా
13. యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను గనుక అతడు వారి మాట వినకపోయెను.
14. తరువాత యెహోవామోషేతో ఇట్లనెనుఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనియ్యనొల్లడాయెను
15. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్లుము, ఇదిగో అతడు ఏటిదరికి పోవును. నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటియొడ్డున నిలిచి పాముగా చేయబడిన కఱ్ఱను చేతపట్టుకొని
16. అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకుగాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవుఇదివరకు వినకపోతివి.
17. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీనిబట్టి నీవు తెలిసి కొందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న యీ కఱ్ఱతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును.
18. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపుకొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పు మనెను.
19. మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు అహరోనుతోనీకఱ్ఱను పట్టుకొని ఐగుప్తు జలములమీద, అనగా వారి నదులమీదను వారి కాలువలమీదను, వారి చెరువుల మీదను, వారి నీటిగుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము; అవి రక్తమగును; ఐగుప్తు దేశమందంతటను మ్రానుపాత్రలలోను రాతిపాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను.
20. యెహోవా ఆజ్ఞా పించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కఱ్ఱను పైకెత్తి ఏటినీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నియు రక్తముగా మార్చబడెను.
21. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపుకొట్టెను, ఐగుప్తీయులు ఏటినీళ్లు త్రాగలేక పోయిరి, ఐగుప్తుదేశమం దంతట రక్తము ఉండెను.
22. ఐగుప్తు శకునగాండ్రుకూడ తమ మంత్రములవలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను.
23. జరిగిన దానిని మనస్సున పెట్టక ఫరో తిరిగి తన యింటికి వెళ్లెను.
24. అయితే ఐగుప్తీ యులందరు ఏటినీళ్లు త్రాగలేక త్రాగు నీళ్లకొరకు ఏటిప్రక్కలను త్రవ్విరి.
25. యెహోవా ఏటిని కొట్టి యేడు దినములైన
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 8
1. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ఫరో యొద్దకు వెళ్లి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము;
2. నీవు వారిని పోనియ్యనొల్లనియెడల ఇదిగో నేను నీ పొలి మేరలన్నిటిని కప్పలచేత బాధించెదను.
3. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును; అవి నీ యింట నీ పడకగదిలోనికి నీ మంచముమీదికి నీ సేవకుల యిండ్లలోనికి నీ జనులమీదికి నీ పొయిలలోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును;
4. ఆ కప్పలు నీ మీదికి నీ జనుల మీదికి నీ సేవకులందరిమీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమ నెను.
5. మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు అహరోనును చూచినీ కఱ్ఱ పట్టుకొని యేటిపాయల మీదను కాలువలమీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశముమీదికి కప్పలను రాజేయుమని అతనితో చెప్పుమనగా
6. అహరోను ఐగుప్తు జలములమీద తన చెయ్యి చాపెను; అప్పుడు కప్పలు ఎక్కివచ్చి ఐగుప్తు దేశమును కప్పెను.
7. శకునగాండ్రు కూడ తమ మంత్రములవలన అలాగు చేసి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేసిరి.
8. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించినా యొద్దనుండి నా జనులయొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడు కొనుడి, అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగ
9. అందుకు మోషేనన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును, ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ యిండ్లలోను ఉండకుండ చంపబడునట్లును నీ కొరకును నీ సేవక
10. అందుకతడుమా దేవుడైన యెహోవా వంటి వారెవరును లేరు అని నీవు తెలిసికొనునట్లు నీ మాట చొప్పున జరుగును;
11. అనగా కప్పలు నీ యొద్ద నుండియు నీ యిండ్లలో నుండియు నీ సేవకుల యొద్ద నుండియు నీ ప్రజలయొద్దనుండియు తొలగి పోవును; అవి యేటిలోనే ఉండుననెను.
12. మోషే అహరోనులు ఫరో యొద్దనుండి బయలు వెళ్లినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయములో మోషే అతనికొరకు మొఱ పెట్టగా
13. యెహోవా మోషే మాటచొప్పున చేసెను గనుక ఇండ్లలో నేమి వెలుపల నేమి పొలములలో నేమి కప్పలు ఉండకుండ చచ్చిపోయెను.
14. జనులు వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపుకొట్టెను.
15. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరచుకొని వారి మాట వినక పోయెను.
16. అందుకు యెహోవా మోషేతో నీవు నీ కఱ్ఱ చాపి యీ దేశపు ధూళిని కొట్టుము. అది ఐగుప్తు దేశమందంత టను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి.
17. అహరోను తన కఱ్ఱను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యులమీదను జంతువులమీదను ఉండెను; ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలా¸
18. శకునగాండ్రు కూడ పేలను పుట్టించవలెనని తమ మంత్రములచేత అట్లు చేసిరి గాని అది వారివలన కాకపోయెను. పేలు మను ష్యులమీదను జంతువులమీదను ఉండగా
19. శకునగాండ్రుఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారిమాట వినకపోయెను.
20. కాబట్టి యెహోవా మోషేతొ నీవు ప్రొద్దున లేచి ఫరో యెదుట నిలువుము, ఇదిగో అతడు ఏటియొద్దకు పోవును. నీవు అతని చూచినన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము.
21. నీవు నా ప్రజలను పోనియ్యని యెడల చూడుము నేను నీ మీదికిని నీ సేవకుల మీదికిని నీ ప్రజలమీదికిని నీ యిండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను; ఐగుప్తీ యుల యిండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును.
22. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలిసికొనునట్లు, ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెనుదేశమును వినాయించెదను, అక్కడ ఈగలగుంపు లుండవు.
23. నా ప్రజలను నీ ప్రజలనుండి ప్రత్యేకపరచెదను, రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెననెను.
24. యెహోవా ఆలాగు చేసెను. బాధకరమైన ఈగలగుంపులు ఫరో యింటిలోకిని అతని సేవకుల యిండ్లలోకిని వచ్చి ఐగుప్తు దేశమంతట వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపులవలన చెడిపోయెను.
25. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించిమీరు వెళ్లి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా
26. మోషే అట్లు చేయతగదు; మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల యెదుట అర్పించిన యెడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు గదా.
27. మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంత దూరముపోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి నర్పించుదు మనెను.
28. అందుకు ఫరోమీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకు మిమ్మును పోనిచ్చెదను గాని దూరము పోవద్దు; మరియు నాకొరకు వేడు కొనుడనెను.
29. అందుకు మోషేనేను నీ యొద్దనుండి వెళ్లి రేపు ఈ యీగల గుంపులు ఫరో యొద్దనుండియు అతని సేవకుల యొద్దనుండియు అతని జనుల యొద్ద నుండియు తొలగి పోవునట్లు యెహోవాను వేడ
30. ఫరో యొద్దనుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను.
31. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండియు అతని సేవకుల యొద్ద నుండియు అతని ప్రజల యొద్దనుండియు తొలగిపోయెను; ఒక్కటియైనను నిలువలేదు.
32. అయితే ఫరో ఆ సమయమునకూడ తన హృదయమును కఠినపరచుకొని జనులను పోనియ్యడాయెను.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 9
1. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ఫరోయొద్దకు వెళ్లినన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము.
2. నీవు వారిని పోనియ్యనొల్లక ఇంకను వారిని నిర్బంధించినయెడల
3. ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువులమీదికిని నీ గుఱ్ఱములమీదికిని గాడిదలమీదికిని ఒంటెలమీదికిని ఎద్దుల మీదికిని గొఱ్ఱల మీదికిని వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును.
4. అయితే యెహోవా ఇశ్రాయేలీ యుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును; ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని
5. మరియు యెహోవా కాలము నిర్ణయించిరేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను.
6. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నియు చచ్చెను గాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటియు చావలేదు.
7. ఫరో ఆ సంగతి తెలిసికొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియు చావలేదు; అయినను అప్పటికిని ఫరో హృదయము కఠినమై నందున జనులను పంపక పోయెను.
8. కాగా యెహోవామీరు మీ పిడికిళ్లనిండ ఆవపు బుగ్గి తీసికొనుడి, మోషే ఫరో కన్నులయెదుట ఆకాశమువైపు దాని చల్లవలెను.
9. అప్పుడు అది ఐగుప్తు దేశ మంతట సన్నపు ధూళియై ఐగుప్తు దేశమంతట మనుష్యుల మీదను జంతువులమీదను పొక్కులు పొక్కు దద్దురు లగునని మోషే అహరోనులతో చెప్పెను.
10. కాబట్టి వారు ఆవపుబుగ్గి తీసికొనివచ్చి ఫరో యెదుట నిలిచిరి. మోషే ఆకాశమువైపు దాని చల్లగానే అది మనుష్యులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దురులాయెను.
11. ఆ దద్దురులవలన శకునగాండ్రు మోషేయెదుట నిలువ లేకపోయిరి ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయు లందరికిని పుట్టెను.
12. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు వారి మాట వినకపోయెను.
13. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెనుహెబ్రీ యుల దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు; నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరోయెదుట నిలిచినన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము.
14. సమస్త భూమిలో నావంటివారెవరును లేరని నీవు తెలిసికొనవలెనని ఈ సారి నేను నా తెగుళ్ళన్నియు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకులమీదికిని నీ ప్రజలమీదికిని పంపెదను;
15. భూమిమీద నుండకుండ నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసియుందును.
16. నా బలమును నీకు చూపునట్లును, భూలోక మందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియ మించితిని.
17. నీవు ఇంక నా ప్రజలను పోనియ్యనొల్లక వారిమీద ఆతిశయపడుచున్నావు.
18. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధ కరమైన వడగండ్లను కురిపించె దను; ఐగుపు ్తరాజ్యము స్థాపించిన దినము మొదలుకొని యిదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు.
19. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రముచేయుము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యునిమీదను జంతువు మీదను వడగండ్లు కురియును, అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను.
20. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను.
21. అయితే యెహోవా మాట లక్ష్యపెట్టనివాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను.
22. యెహోవానీ చెయ్యి ఆకాశమువైపు చూపుము; ఐగుప్తుదేశమందలి మనుష్యులమీదను జంతువులమీదను పొలముల కూరలన్నిటిమీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతట పడునని మోషేతో చెప్పెను.
23. మోషే తనకఱ్ఱను ఆకాశమువైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమిమీద పడుచుండెను. యెహోవా ఐగుప్తుదేశముమీద వడగండ్లు కురిపించెను.
24. ఆలాగు వడగండ్లును వడగండ్లతో కలిసిన పిడుగులును బహు బలమైన వాయెను. ఐగుప్తు దేశమం దంతటను అది రాజ్యమైనది మొదలుకొని యెన్నడును అట్టివి కలుగలేదు.
25. ఆ వడగండ్లు ఐగుప్తుదేశమందంతట మనుష్యుల నేమి జంతువుల నేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరుగ గొట్టెను.
26. అయితే ఇశ్రాయేలీయులున్న గోషెను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు.
27. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపినేను ఈసారి పాపముచేసియున్నాను; యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులును దుర్మార్గులము;
28. ఇంతమట్టుకు చాలును; ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా
29. మోషే అతని చూచినేను ఈ పట్టణమునుండి బయలు వెళ్లగానే నా చేతులు యెహోవావైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లును ఇకమీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును.
30. అయినను నీవును నీ సేవకులును ఇకను దేవుడైన యెహో వాకు భయపడరని నాకు తెలిసియున్నదనెను.
31. అప్పుడు జనుపచెట్లు పువ్వులు పూసెను, యవలచేలు వెన్నులు వేసినవి గనుక జనుప యవలచేలును చెడగొట్టబడెను గాని
32. గోధుమలు మెరపమొలకలు ఎదగనందున అవి చెడగొట్ట బడలేదు.
33. మోషే ఫరోను విడిచి ఆ పట్టణమునుండి బయలు వెళ్లి యెహోవావైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ యురుములును వడగండ్లును నిలిచిపోయెను, వర్షము భూమి మీద కురియుట మానెను.
34. అయితే ఫరో వర్షమును వడ గండ్లును ఉరుములును నిలిచిపోవుట చూచి, అతడును అతని సేవకులును ఇంక పాపము చేయుచు తమ హృదయ ములను కఠినపరచుకొనిరి.
35. యెహోవా మోషేద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను; అతడు ఇశ్రాయేలీయులను పోనియ్యక పోయెను.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 10
1. కాగా యెహోవా మోషేతోఫరోయొద్దకు వెళ్లుము. నేనే యెహోవానని మీరు తెలిసికొనునట్లును, నేను చేయు సూచకక్రియలను ఐగుప్తీయుల యెదుట కను పరచుటకు, నేను వారియెడల జరిగించిన వాటిని వారి యెదుట కలుగజేసిన సూచకక్రియలను
2. నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును, నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరచితిననెను.
3. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి, అతనిని చూచి యీలాగు చెప్పిరిహెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగానీవు ఎన్నాళ్లవరకు నాకు లొంగనొల్లక యుందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము.
4. నీవు నా జను లను పోనియ్య నొల్లనియెడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములలోనికి రప్పించెదను.
5. ఎవడును నేలను చూడలేనంతగా అవి దాని కప్పును, తప్పించుకొనిన శేష మును, అనగా వడగండ్లదెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును, పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును.
6. మరియు అవి నీ యిండ్లలోను నీ సేవకులందరి యిండ్లలోను ఐగుప్తీయులందరి యిండ్లలోను నిండిపోవును. నీ పితరులుగాని నీ పితామహులుగాని యీ దేశములో నుండిన నాటనుండి నేటివరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో యెదుట నుండి బయలు వెళ్లెను.
7. అప్పుడు ఫరో సేవకులు అతని చూచిఎన్నాళ్లవరకు వీడు మనకు ఉరిగా నుండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుష్యులను పోనిమ్ము; ఐగుప్తుదేశము నశించినదని నీకింక
8. మోషే అహరోనులు ఫరోయొద్దకు మరల రప్పింపబడగా అతడుమీరు వెళ్లి మీ దేవుడైన యెహో వాను సేవించుడి; అందుకు ఎవరెవరు వెళ్లుదురని వారి నడిగెను.
9. అందుకు మోషేమేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతోకూడ వెళ్లెదమనె
10. అందు కతడుయెహోవా మీకు తోడై యుండునా? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చెదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు.
11. పురుషులైన మీరు మాత్రము వెళ్లి యెహోవాను సేవించుడి; మీరు కోరినది అదే గదా అని వారితో అనగా ఫరో సముఖమునుండి వారు వెళ్లగొట్టబడిరి.
12. అప్పుడు యెహోవా మోషేతోమిడతలు వచ్చు నట్లు ఐగుప్తుదేశముమీద నీ చెయ్యి చాపుము; అవి ఐగుప్తుదేశముమీదకి వచ్చి యీ దేశపు పైరులన్నిటిని, అనగా వడగండ్లు పాడుచేయని వాటినన్నిట
13. మోషే ఐగుప్తుదేశముమీద తన కఱ్ఱను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశముమీద తూర్పుగాలిని విసర జేసెను; ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను.
14. ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధకర మైనవి, అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడును ఉండలేదు. తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను.
15. ఆ దేశమున చీకటికమ్మెను, ఆ దేశపు కూరగాయలన్నిటిని ఆ వడగండ్లు పాడుచేయని వృక్షఫలములన్నిటిని అవి తినివేసెను. ఐగుప్తు దేశమంతట చెట్లేగాని పొలముల కూరయే గాని పచ్చని దేదియు మిగిలియుండలేదు.
16. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యెహోవాయెడలను మీ యెడలను పాపముచేసితిని.
17. మీరు దయచేసి, యీసారి మాత్రమే నా పాపము క్షమించి, నా మీదనుండి యీ చావు మాత్రము తొల గించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా
18. అతడు ఫరో యొద్దనుండి బయలువెళ్లి యెహోవాను వేడు కొనెను.
19. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటిగాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎఱ్ఱసముద్రములో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతయైనను నిల
20. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను; అతడు ఇశ్రాయేలీయులను పోనియ్యడాయెను.
21. అందుకు యెహోవా మోషేతోఆకాశమువైపు నీ చెయ్యి చాపుము. ఐగుప్తుదేశముమీద చీకటి చేతికి తెలియునంత చిక్కని చీకటి కమ్ముననెను.
22. మోషే ఆకాశమువైపు తన చెయ్యి యెత్తినప్పుడు ఐగుప్తుదేశ మంతయు మూడు దినములు గాఢాంధకార మాయెను.
23. మూడు దినములు ఒకని నొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటనుండి లేవలేక పోయెను; అయినను ఇశ్రా యేలీయులకందరికి వారి నివాసములలో వెలుగుండెను.
24. ఫరో మోషేను పిలిపించిమీరు వెళ్లి యెహోవాను సేవించుడి. మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్లవచ్చుననగా
25. మోషేమేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణలనిమిత్తమును నీవు మాకు పశువులనియ్యవలెను.
26. మా పశువులును మాతోకూడ రావలెను. ఒక డెక్కయైనను విడువబడదు, మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలోనుండి తీసికొనవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరకమునుపు మాకు తెలియదనెను.
27. అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనియ్య నొల్లక యుండెను.
28. గనుక ఫరోనా యెదుటనుండి పొమ్ము భద్రము సుమీ; నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువని అతనితో చెప్పెను.
29. అందుకు మోషేనీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడననెను.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 11
1. మరియు యెహోవా మోషేతో ఇట్లనెనుఫరో మీదికిని ఐగుప్తుమీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటుతరువాత అతడు ఇక్కడనుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఇక్కడనుండి మిమ్మును బొత్తిగా వెళ్లగొట్టును.
2. కాబట్టి తన చెలికానియొద్ద ప్రతి పురుషుడును తన చెలి కత్తెయొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసికొనుడని ప్రజలతో చెప్పుము.
3. యెహోవా ప్రజలయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను; అదిగాక ఐగుప్తుదేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను.
4. మోషే ఫరోతో ఇట్లనెనుయెహోవా సెలవిచ్చిన దేమనగామధ్యరాత్రి నేను ఐగుప్తుదేశములోనికి బయలు వెళ్లెదను.
5. అప్పుడు సింహాసనముమీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్లవరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లలందరును చచ్చెదరు; జంతు వులలోను తొలిపిల్లలన్నియు చ
6. అప్పుడు ఐగుప్తు దేశమందంతట మహా ఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇకమీదట పుట్టదు.
7. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచు నని మీకు తెలియబడునట్లు, మనుష్యులమీదగాని జంతు వులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు.
8. అప్పుడు నీ సేవకులైన వీరందరు నా యొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసినీవును, నిన్ను ఆశ్రయించియున్న యీ ప్రజలంద రును బయలు వెళ్లుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్లుద
9. అప్పుడు యెహోవాఐగుప్తుదేశములో నా మహ త్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను.
10. మోషే అహరోనులు ఫరో యెదుట ఈ మహత్కార్యములను చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశములోనుండి ఇశ్రాయేలీయులను పోనియ్య డాయెను.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 12
1. మోషే అహరోనులు ఐగుప్తుదేశములో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను
2. నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల.
3. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజ ముతోఈ నెల దశమినాడు వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను.
4. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలక పోయినయెడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాని తీసికొన వలెను.
5. ఆ గొఱ్ఱపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితినిబట్టి వారిని లెక్కింపవలెను.
6. నిర్దోషమైన యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొఱ్ఱలలో నుండి యైనను మేకలలో నుండియైనను దాని తీసికొనవచ్చును.
7. ఈ నెల పదునాలుగవ దినమువరకు మీరు దాని నుంచు కొనవలెను; తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిని యిండ్లద్వారబంధపు రెండు నిలువు కమ్ములమీదను పై కమ్మి మీదను చల్లి
8. ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదుకూరలతో దాని తినవలెను
9. దాని తలను దాని కాళ్లను దాని ఆంత్ర ములను అగ్నితో కాల్చి దాని తినవలెను;
10. దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు; ఉదయకాలమువరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలమువరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను.
11. మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలు చేత పట్టుకొని, త్వరపడుచుదాని తినవలెను; అది యెహో వాకు పస్కాబలి.
12. ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమందు సంచరించి, ఐగుప్తుదేశమందలి మనుష్యులలోనేగాని జంతు వులలోనేగాని తొలి సంతతియంతయు హతముచేసి, ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను; నేను యెహో వాను.
13. మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు.
14. కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగగా దాని నాచ రింపవలెను; తరతరములకు నిత్యమైనకట్టడగా దాని నాచ రింపవలెను.
15. ఏడుదినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటిదినమున మీ యిండ్ల లోనుండి పొంగినది పార వేయవలెను. మొదటి దినము మొదలుకొని యేడవ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతిమనుష్యుడు ఇశ్రాయేలీ యులలోనుండి కొట్టివేయబడును.
16. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, ఏడవ దినమున పరిశుద్ధ సంఘము గాను కూడుకొనవలెను. ఆ దినములయందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును; అదియు గాక మరి ఏ పనియు చేయ కూడదు.
17. పులియని రొట్టెల పండుగను మీరు ఆచ రింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము నాచరింపవలెను; ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును.
18. మొదటి నెల పదునాలుగవదినము సాయం కాలము మొదలుకొని ఆ నెల యిరువది యొకటవదినము సాయంకాలమువరకు మీరు పులియనిరొట్టెలను తినవలెను.
19. ఏడు దినములు మీ యిండ్లలో పొంగిన దేదియును ఉండ కూడదు, పులిసిన దానిని తినువాడు అన్యుడేగాని దేశ ములో పుట్టిన వాడేగాని ఇశ్రాయేలీ యుల సమాజములో నుండక కొట్టివేయబడును.
20. మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోను పులియని వాటినే తినవలెనని చెప్పుమనెను.
21. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దల నందరిని పిలిపించి వారితో ఇట్లనెనుమీరు మీ కుటుంబముల చొప్పున మందలోనుండి పిల్లను తీసికొని పస్కా పశువును వధించుడి.
22. మరియు హిస్సోపు కుంచె తీసికొని పళ్లెములో నున్న రక్తములో దాని ముంచి, ద్వారబంధపు పైకమ్మికిని రెండు నిలువు కమ్ములకును పళ్లెములోని రక్తమును తాకింప వలెను. తరువాత మీలో నెవరును ఉదయమువరకు తన యింటి ద్వారమునుండి బయలు వెళ్లకూడదు.
23. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు, ద్వారబంధపు పైకమ్మిమీదను రెండు నిలువు కమ్ములమీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును; మిమ్ము హతము చేయుటకు మీ యిండ్లలోనికి సంహారకుని చొరనియ్యడు.
24. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను.
25. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీ కిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీని నాచరింపవలెను.
26. మరియు మీకుమారులుమీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్ము నడుగునప్పుడు
27. మీరు ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఐగుప్తీ యులను హతము చేయుచు మన యిండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల యిండ్లను విడిచి పెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కా రముచేసిరి.
28. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లి ఆలాగుచేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి.
29. అర్ధరాత్రివేళ జరిగినదేమనగా, సింహాసనముమీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లల నందరిని పశువుల తొలిపిల్లల
30. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరును ఐగుప్తీయులందరును లేచినప్పుడు శవములేని ఇల్లు ఒకటైన లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను.
31. ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించివారితోమీరును ఇశ్రాయేలీయులును లేచి నా ప్రజల మధ్యనుండి బయలు వెళ్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహో వాను సేవించుడి.
32. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసికొని పోవుడి; నన్ను దీవించుడని చెప్పెను.
33. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారమనుకొని, తమ దేశములోనుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బల వంతముచేసిరి.
34. కాబట్టి ప్రజలు తమ పిండిముద్దను తీసికొని, అది పులియక మునుపే పిండి పిసుకు తొట్లతో దానిని మూటకట్టు కొని, తమ భుజములమీద పెట్టుకొని పోయిరి.
35. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పునచేసి ఐగుప్తీయులయొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసికొనిరి.
36. యెహోవా ప్రజలయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి.
37. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసునుండి సుక్కో తుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలు గాక కాల్బలము ఆరులక్షల వీరులు.
38. అనేకులైన అన్యజనుల సమూహమును, గొఱ్ఱలు ఎద్దులు మొదలైన పశువుల గొప్పమంద యును వారితోకూడ బయలుదేరెను.
39. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలుచేసి కాల్చిరి. వారు ఐగుప్తులోనుండి వెళ్లగొట్టబడి తడవుచేయ లేకపోయిరి గనుక అది పులిసి యుండలేదు, వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని యుండలేదు.
40. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు.
41. ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడచిన తరువాత జరిగిన దేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నియు ఐగుప్తుదేశములో నుండి బయలుదేరిపోయెను.
42. ఆయన ఐగుప్తుదేశములో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరు తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి యిదే.
43. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెనుఇది పస్కాపండుగను గూర్చిన కట్టడ; అన్యుడెవ డును దాని తినకూడదు గాని
44. వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాని తినవచ్చును.
45. పరదేశియు కూలికివచ్చిన దాసుడును దాని తినకూడదు.
46. మీరు ఒక్క యింటిలోనే దాని తినవలెను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసికొని పోకూడదు, దానిలో ఒక్క యెముకనైనను మీరు విరువ కూడదు.
47. ఇశ్రాయేలీయుల సర్వసమాజము ఈ పండుగను ఆచరింపవలెను.
48. నీయొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరినయెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను; తరువాత అతడు సమాజములో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టి వాడు మీ దేశములో పుట్టినవానితో సముడగును. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు.
49. దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీనిగూర్చి ఒకటే విధి యుండవలె ననెను.
50. ఇశ్రాయేలీయులందరు ఆలాగు చేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి.
51. యెహోవా ఇశ్రాయేలీయులను వారివారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెను.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 13
1. మరియు యెహోవా మోషేతో ఈలాగు సెల విచ్చెను
2. ఇశ్రాయేలీయులలో మనుష్యుల యొక్కయు పశువులయొక్కయు ప్రథమ సంతతి, అనగా ప్రతి తొలి చూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము; అది నాదని చెప్పెను.
3. మోషే ప్రజలతో నిట్లనెనుమీరు దాసగృహమైన ఐగుప్తునుండి బయలుదేరివచ్చిన దినమును జ్ఞాప కము చేసికొనుడి. యెహోవా తన బాహు బలముచేత దానిలోనుండి మిమ్మును బయటికి రప్పించెను; పులిసిన దేదియు తినవద్దు.
4. ఆబీబనునెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరిగదా.
5. యెహోవానీ కిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు, కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు హివ్వీయులకు యెబూసీయు లకు నివాసస్థానమై యుండు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను.
6. ఏడు దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను, ఏడవ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను.
7. పులియని వాటినే యేడు దినములు తినవలెను. పులిసినదేదియు నీయొద్దకనబడ కూడదు. నీ ప్రాంతము లన్నిటిలోను పొంగినదేదియు నీయొద్ద కనబడకూడదు.
8. మరియు ఆ దినమున నీవునేను ఐగుప్తు లోనుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసినదాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పవలెను.
9. యెహోవా ధర్మ శాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులోనుండి నిన్ను బయటికి రప్పించెనను టకు, ఈ ఆచారము నీ చేతిమీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును.
10. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను.
11. యెహోవా నీతోను నీ పితరులతోను ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశములోనికి నిన్ను చేర్చి దానిని నీకిచ్చిన తరువాత
12. ప్రతి తొలి చూలుపిల్లను, నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగసంతానము యెహోవా దగును.
13. ప్రతి గాడిద తొలి పిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొఱ్ఱపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని యెడల దాని మెడను విరుగదీయ వలెను. నీ కుమారులలో తొలిచూలియైన ప్రతి మగ వానిని వెలయిచ్చి విడిపింపవలెను.
14. ఇకమీదట నీ కుమా రుడుఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచిబాహుబలముచేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులోనుండి మనలను బయటికి రప్పించెను.
15. ఫరో మనలను పోనియ్యకుండ తన మనస్సును కఠినపరచుకొనగా యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తుదేశములో తొలి సంతాన మంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగ దైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును; అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెలయిచ్చి విడిపించుదునని చెప్పవలెను.
16. బాహు బలముచేత యెహోవా మనలను ఐగుప్తులోనుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతిమీద సూచన గాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పెను.
17. మరియు ఫరో ప్రజలను పోనియ్యగా దేవుడుఈ ప్రజలు యుద్ధము చూచునప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని, ఫిలిష్తీయులదేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు.
18. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎఱ్ఱసముద్రపు అరణ్యమార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులోనుండి వచ్చిరి.
19. మరియు మోషే యోసేపు ఎముకలను తీసికొని వచ్చెను. అతడుదేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును; అప్పుడు మీరు నా ఎముక లను ఇక్కడనుండి తీసికొని పోవలెనని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని యుండెను.
20. వారు సుక్కోతునుండి ప్రయాణమై పోయి, అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి.
21. వారు పగలు రాత్రియుప్రయాణము చేయునట్లుగా యెహోవాత్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను.
22. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజలయెదుటనుండి తొలగింపలేదు.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 14
1. మరియు యెహోవా మోషేతో ఈలాగు సెల విచ్చెను
2. ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్య నున్న బయల్సెఫోను నెదుటను, దిగవలెనని వారితో చెప్పుము; దాని యెదుటి సముద్రమునొద్ద వారు
3. ఫరో ఇశ్రాయేలీయులనుగూర్చివారు ఈ దేశములో చిక్కుబడి యున్నారు; అరణ్యము వారిని మూసి వేసెనని అను కొనును.
4. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచె దను; అతడు వారిని తరుమగా; నేను ఫరోవలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును; నేను యెహోవానని ఐగుప్తీయుల
5. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్ప బడిమనమెందుకీలాగు చేసితివిు? మన సేవలో నుండకుండ ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చి తివిు అని చెప్పు కొనిరి.
6. అంతట అతడు తన రథమును సిద్ధపరచుకొని, తన జనమును తనతోకూడ తీసికొని పోయెను.
7. మరియు అతడు శ్రేష్ఠమైన ఆరువందల రథములను ఐగుప్తు రథముల నన్నిటిని వాటిలో ప్రతిదానిమీద అధిపతులను తోడు కొనిపోయెను.
8. యెహోవా ఐగుప్తురాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలీయులను తరి మెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమిచేత బయలు వెళ్లు చుండిరి.
9. ఐగుప్తీయులు, అనగా ఫరో రథముల గుఱ్ఱము లన్నియు అతని గుఱ్ఱపు రౌతులు అతని దండును వారిని తరిమి, బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలిసికొనిరి.
10. ఫరో సమీపించుచుండగా ఇశ్రా యేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమవెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొఱపెట్టిరి.
11. అంతట వారు మోషేతోఐగుప్తులో సమాధులు లేవని యీ యరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులోనుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేల?
12. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పినమాట యిదే గదా; మేము ఈ అరణ్యమందు చచ్చుటకంటెె ఐగుప్తీయు లకు దాసుల మగుటయే మేలని చెప్పిరి.
13. అందుకు మోషేభయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు.
14. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను.
15. అంతలో యెహోవా మోషేతోనీవేల నాకు మొఱ పెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము.
16. నీవు నీ కఱ్ఱను ఎత్తి ఆ సముద్రమువైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోవుదురు.
17. ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృద యములను కఠినపరుచుదును. వారు వీరిని తరుముదురు; నేను ఫరోవలనను అతని సమస్త సేనవలనను అతని రథముల వలనను అతని గుఱ్ఱపు రౌతులవలనను నాకు మహిమ తెచ్చు కొందును.
18. నేను ఫరోవలనను అతని రథములవలనను అతని గుఱ్ఱపు రౌతులవలనను మహిమ తెచ్చుకొనునప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను.
19. అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవ దూత వారి వెనుకకుపోయి వారిని వెంబడించెను; ఆ మేఘస్తంభము వారి యెదుటనుండి పోయి వారి వెనుక నిలిచెను
20. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను; అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని, రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల
21. మోషే సము ద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను.
22. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.
23. ఐగుప్తీయులును ఫరో గుఱ్ఱములును రథములును రౌతులును వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి.
24. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభమునుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి
25. వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రా యేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; యెహోవా వారిపక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి.
26. అంతలో యెహోవా మోషేతోఐగుప్తీయుల మీది కిని వారి రథములమీదికిని వారి రౌతులమీదికిని నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రముమీద నీ చెయ్యి చాపుమనెను.
27. మోషే సముద్రముమీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రముమధ్యను ఐగుప్తీయులను నాశము చేసెను.
28. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరోయొక్క సర్వసేనను కప్పివేసెను; వారిలో ఒక్కడైనను మిగిలి యుండలేదు.
29. అయితే ఇశ్రాయేలీయులు ఆరిననేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను గోడవలె నుండెను.
30. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీ యులను సముద్రతీరమున చూచిరి.
31. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్య మును ఇశ్రాయేలీ యులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందును ఆయన సేవకుడైన మోషేయందును నమ్మకముంచిరి.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 15
1. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులును యెహో వానుగూర్చి యీ కీర్తన పాడిరి యెహోవానుగూర్చి గానముచేసెదను ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును ఆయన సముద్రవ
2. యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను.ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను.
3. యెహోవా యుద్ధశూరుడు యెహోవా అని ఆయనకు పేరు.
4. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎఱ్ఱసముద్రములో మునిగిపోయిరి
5. అగాధజలములు వారిని కప్పెను వారు రాతివలె అడుగంటిపోయిరి.
6. యెహోవా, నీ దక్షిణహస్తము బలమొంది అతిశయించును యెహోవా, నీ దక్షిణ హస్తము శత్రువుని చితక గొట్టును.
7. నీ మీదికి లేచువారిని నీ మహిమాతిశయమువలన అణచివేయుదువు నీ కోపాగ్నిని రగులజేయుదువు అది వారిని చెత్తవలె దహించును.
8. నీ నాసికారంధ్రముల ఊపిరివలన నీళ్లు రాశిగా కూర్చబడెను ప్రవాహములు కుప్పగా నిలిచెను అగాధజలములు సముద్రముమధ్య గడ్డకట్టెను
9. తరిమెదను కలిసికొనియెదను దోపుడుసొమ్ము పంచుకొనియెదను వాటివలన నా ఆశ తీర్చుకొనియెదను నా కత్తి దూసెదను నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువనుకొనెను.
10. నీవు నీ గాలిని విసరజేసితివి సముద్రము వారిని కప్పెను వారు మహా అగాధమైన నీళ్లలో సీసమువలె మునిగిరి.
11. యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు
12. నీ దక్షిణహస్తమును చాపితివి భూమి వారిని మింగివేసెను.
13. నీవు విమోచించిన యీ ప్రజలను నీ కృపచేత తోడుకొనిపోతివినీ బలముచేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడి పించితివి.
14. జనములు విని దిగులుపడును ఫిలిష్తియ నివాసులకు వేదన కలుగును.
15. ఎదోము నాయకులు కలవరపడుదురు మోయాబు బలిష్ఠులకు వణకు పుట్టును కనాను నివాసులందరు దిగులొంది కరిగిపోవు దురు.భయము అధికభయము వారికి కలుగును.
16. యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరువరకు నీవు సంపాదించిన యీ ప్రజలు అద్దరికి చేరువరకు నీ బాహుబలముచేత పగవారు రాతివలె కదలకుందురు.
17. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండమీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను
18. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువ పెట్టెదవు.యెహోవా నిరంతరమును ఏలువాడు.
19. ఫరో గుఱ్ఱములు అతని రథములు అతని రౌతులును సముద్రములో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సము ద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిరి.
20. మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరు తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా
21. మిర్యాము వారితో కలిసి యిట్లు పల్లవి యెత్తి పాడెను యెహోవాను గానము చేయుడి ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను.
22. మోషే ఎఱ్ఱ సముద్రమునుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్లి దానిలో మూడు దిన ములు నడిచిరి; అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి.
23. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను.
24. ప్రజలుమేమేమి త్రాగుదుమని మోషేమీద సణగు కొనగా
25. అతడు యెహోవాకు మొఱపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురము లాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి, అక
26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధే యులై ఆయన కట్టడ లన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలు
27. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి; అక్కడ పండ్రెండు నీటి బుగ్గలును డెబ్బది యీత చెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్లయొద్ద దిగిరి.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 16
1. తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీమునుండి ప్రయాణమైపోయి, వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన రెండవనెల పదునైదవ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి.
2. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజ మంతయు మోషే అహరోనులమీద సణిగెను.
3. ఇశ్రా యేలీయులుమేము మాంసము వండుకొను కుండలయొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతివలన ఏల చావక పోతివిు? ఈ సర్వసమాజమును ఆకలిచేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితో ననగా
4. యెహోవా మోషేను చూచిఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను; వారు నా ధర్మశాస్త్రము ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను.
5. మరియు ఆరవ దినమున వారు తెచ్చుకొనినదానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకొనుదానికంటె అది రెండంతలై యుండవలెననెను.
6. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రా యేలీయులందరితోయెహోవా ఐగుప్తు దేశ ములోనుండి మిమ్మును బయటికి రప్పించెనని సాయంకాలమందు మీకు తెలియబడును.
7. యెహోవామీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు; ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, మేము ఏపాటి వారము? మామీద సణుగనేల అనిరి.
8. మరియు మోషేమీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయ మున చాలినంత ఆహారమును యెహోవా మీకియ్యగాను, మీరు ఆయనమీద సణుగు మీ సణుగులను యెహోవాయే వినుచుండగాను, మేము ఏపాటివారము? మీ సణుగుట యెహోవా మీదనేగాని మామీద కాదనెను
9. అంతట మోషే అహరోనుతోయెహోవా సన్నిధికి సమీపించుడి; ఆయన మీ సణుగులను వినెనని నీవు ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో చెప్పుమనెను.
10. అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యమువైపు చూచిరి, అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను.
11. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనునేను ఇశ్రాయేలీయుల సణుగులను వింటిని
12. నీవుసాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారముచేత తృప్తిపొందుదురు, అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురని వారితో చెప్పుమనెను.
13. కాగా సాయంకాలమున పూరేడులువచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచువారి పాళెముచుట్టు పడియుండెను.
14. పడిన ఆ మంచు ఇగిరిపోయిన తరువాత నూగుమంచువలె సన్నని కణములు అరణ్యపు భూమిమీద కనబడెను.
15. ఇశ్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియకఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి.
16. మోషేఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించిన దేమనగాప్రతివాడును తనవారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరుచొప్పున దాని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారములో నున్నవారికొరకు కూర్చుకొనవ లెననెను.
17. ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చు కొనిరి.
18. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చు కొనినవానికి ఎక్కువగా మిగులలేదు తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువకాలేదు. వారు తమ తమ యింటివారి భోజనమునకు సరిగా కూర్చుకొనియుండిరి.
19. మరియు మోషేదీనిలో ఏమియు ఉదయమువరకు ఎవ రును మిగుల్చు కొనకూడదని వారితో చెప్పెను.
20. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగుపట్టి కంపు కొట్టెను. మోషే వారిమీద కోపపడగా
21. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన యింటివారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను.
22. ఆరవ దినమున వారు ఒక్కొక్కనికి రెండేసి ఓమెరుల చొప్పున రెండంతలు ఆహారము కూర్చు కొనినప్పుడు సమాజముయొక్క అధికారులందరు వచ్చి అది మోషేకు తెలిపిరి.
23. అందుకు అతడుయెహోవా చెప్పినమాట యిది; రేపు విశ్రాంతిదినము, అది యెహో వాకు పరిశుద్ధమైన విశ్రాంతిదినము, మీరు కాల్చుకొన వలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండ
24. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయము వరకు దానిని ఉంచుకొనిరి, అది కంపుకొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు.
25. మోషేనేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతిదినము, నేడు అది బయట దొరకదు.
26. ఆరు దినములు దాని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా ఏడవ దినమున అది దొరకదనెను.
27. అట్లు జరిగెను; ప్రజలలో కొందరు ఏడవ దినమున దాని కూర్చుకొన వెళ్లగా వారికేమియు దొరకక పోయెను.
28. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెనుమీరు ఎన్నాళ్లవరకు నా ఆజ్ఞలను నా ధర్మ శాస్త్ర మును అనుసరించి నడువనొల్లరు?
29. చూడుడి నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతిదినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక ఆరవ దినమున రెండు దినముల ఆహా రము మీ కనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి యుండవలెను. ఏడవ దినమున ఎవడును తన చోటనుండి బయలు వెళ్లకూడదనెను.
30. కాబట్టి యేడవ దినమున ప్రజలు విశ్రమించిరి.
31. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొతి మెరగింజవలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపములవలె నుండెను.
32. మరియు మోషే ఇట్లనెనుయెహోవా ఆజ్ఞాపించినదే మనగానేను ఐగుప్తుదేశము నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచునట్లు, వారు తమయొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను.
33. కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసికొని, దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి, మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను.
34. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాని పెట్టెను.
35. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశము నకు తాము వచ్చు నలుబది యేండ్లు మన్నానే తిను చుండిరి; వారు కనానుదేశపు పొలిమేరలు చేరువరకు మన్నాను తినిరి.
36. ఓమెరు అనగా ఏపాలో దశమ భాగము.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 17
1. తరువాత ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యమునుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లులేనందున
2. మోషేతో వాదించుచుత్రాగుటకు మాకు నీళ్లిమ్మని అడుగగా మోషేమీరు నాతో వాదింపనేల, యెహోవాను శోధింపనేల అని వారితో చెప్పెను.
3. అక్కడ ప్రజలు నీళ్లులేక దప్పిగొని మోషేమీద సణుగుచుఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసి కొని వచ్చితిరనిరి.
4. అప్పుడు మోషే యెహోవాకు మొఱపెట్టుచుఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదు రనెను.
5. అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసికొని ప్రజలకు ముందుగా పొమ్ము; నీవు నదిని కొట్టిన నీ కఱ్ఱను చేత పట్టుకొని పొమ్ము
6. ఇదిగో అక్కడ హోరేబులోని బండమీద నేను నీకు ఎదురుగా నిలిచెదను; నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోనుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవియ్యగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట అట్లు చేసెను.
7. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టియు యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టియు అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను.
8. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రా యేలీయులతో యుద్ధముచేయగా
9. మోషే యెహోషువతోమనకొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసికొని బయలువెళ్లి అమాలేకీయులతో యుద్ధముచేయుము; రేపు నేను దేవుని కఱ్ఱను చేతపట్టుకొని ఆ కొండ శిఖరముమీద నిలిచెదననెను.
10. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను; మోషే అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖర మెక్కిరి
11. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి; మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి,
12. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసికొని వచ్చి అతడు దానిమీద కూర్చుండుటకై దానివేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించువరకు నిలుకడగా ఉండెను.
13. అట్లు యెహోషువ కత్తివాడిచేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను.
14. అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెనునేను అమాలేకీయుల పేరు ఆకాశముక్రింద నుండకుండ బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థ ముగా గ్రంధములో దీని వ్రాసి యెహోషువకు విని పిం
15. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టి
16. అమాలేకీ యులు తమచేతిని యెహోవా సింహాసనమునకు విరోధ ముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములవరకు యుద్ధమనెను.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 18
1. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి వెలుపలికి రప్పించిన సంగతియు, మిద్యాను యాజకుడును మోషేమామయునైన యిత్రో వినినప్పుడు
2. మోషే మామయైన ఆ యిత్రో తనయొద్దకు పంపబడిన మోషే భార్యయైన సిప్పోరాను ఆమె యిద్దరి కుమారులను తోడుకొని వచ్చెను.
3. అతడు అన్యదేశములో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గేర్షోము అని పేరుపెట్టెను.
4. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాతనుండి నన్ను తప్పించెననుకొని రెండవవానికి ఎలీయెజెరని పేరు పెట్టెను.
5. మోషే మామయైన యిత్రో అతని కుమారులనిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషేయొద్దకు వచ్చెను.
6. యిత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడ ఆమె యిద్దరు కుమారులును నీయొద్దకు వచ్చియున్నామని మోషేకు వర్తమానము పంపగా
7. మోషే తన మామను ఎదుర్కొన పోయి వందనము చేసి అతని ముద్దు పెట్టు కొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలిసికొని గుడారములోనికి వచ్చిరి.
8. తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలీయులకొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసిన దంతయు, త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును, యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను.
9. యెహోవా ఐగుప్తీయుల చేతిలొనుిండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను.
10. మరియు యిత్రోఐగుప్తీయుల చేతిలోనుండియు ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించి, ఐగుప్తీయుల చేతిక్రిందనుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక.
11. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయులమీద చేసిన దౌర్జన్య మునుబట్టి ఆయన చేసినదాని చూచి, యెహోవా సమస్త దేవతలకంటె గొప్పవాడని యిప్పుడు నాకు తెలిసిన దనెను.
12. మరియు మోషే మామయైన యిత్రో ఒక దహనబలిని బలులను దేవునికర్పింపగా అహరోనును ఇశ్రా యేలీయుల పెద్దలందరును మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి.
13. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా, ఉదయము మొదలుకొని సాయంకాల మువరకు ప్రజలు మోషేయొద్ద నిలిచియుండిరి.
14. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచినీవు ఈ ప్రజలకు చేయుచున్న యీ పని ఏమిటి? ఉదయము మొదలుకొని సాయంకాలమువరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరు నీయొద్ద నిలిచి యుండనేల అని అడుగగా
15. మోషేదేవుని తీర్పు తెలిసి కొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు.
16. వారికి వ్యాజ్యెము ఏదైనను కలిగినయెడల నా యొద్దకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి, దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్రవిధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పెను.
17. అందుకు మోషే మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు;
18. నీవును నీతో నున్న యీ ప్రజలును నిశ్చయ ముగా నలిగిపోవుదురు; ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయచాలవు.
19. కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడైయుండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యెములను దేవుని యొద్దకు తేవలెను.
20. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్రవిధులను బోధించి, వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను.
21. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి, లంచగొండులుకాని మనుష్యులను ఏర్పరచుకొని, వేయిమందికి ఒకనిగాను, నూరుమందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పది మందికి ఒకనిగాను, వారిమీద న్యాయాధిపతులను నియ మింపవలెను.
22. వారు ఎల్లప్పుడును ప్రజలకు న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప వ్యాజ్యెములన్నిటిని నీయొద్దకు తేవలెను. ప్రతి అల్పవిషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడ ఈ భారమును మోసినయెడల నీకు సుళువుగా ఉండును.
23. దేవుడు ఈలాగు చేయుటకు నీకు సెలవిచ్చినయెడల నీవు ఈ పని చేయుచు దాని భార మును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరు తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్లుదురని చెప్పెను.
24. మోషే తన మామమాట విని అతడు చెప్పినదంతయు చేసెను.
25. ఇశ్రాయేలీయులందరిలో సామర్థ్యముగల మను ష్యులను ఏర్పరచుకొని, వెయ్యిమందికి ఒకనిగాను, నూరు మందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పదిమందికి ఒకనిగాను, న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజలమీద ప్రధానులనుగా నియమించెను.
26. వారెల్లప్పుడును ప్రజలకు న్యాయము తీర్చువారు. వారు కఠిన వ్యాజ్యెములను మోషేయొద్దకు తెచ్చుచు, స్వల్ప వ్యాజ్యె ములను తామే తీర్చుచువచ్చిరి.
27. తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్లెను.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 19
1. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమునుండి బయలుదేరిన మూడవనెలలో, వారు బయలు దేరిననాడే మూడవ నెల ఆరంభదినమందే, వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి.
2. వారు రెఫీదీమునుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి.
3. మోషే దేవునియొద్దకు ఎక్కి పోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచినీవు యాకోబు కుటుంబికులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసిన దేమనగా
4. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చు కొంటినో మీరు చూచితిరి.
5. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగు దురు.
6. సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనము గాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా
7. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తన కాజ్ఞాపించిన ఆ మాటలన్నియు వారియెదుట తెలియపరచెను.
8. అందుకు ప్రజలందరుయెహోవా చెప్పినదంతయు చేసెద మని యేకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను.
9. యెహోవా మోషేతోఇదిగో నేను నీతో మాటలాడు నప్పుడు ప్రజలు విని నిరంతరము నీయందు నమ్మక ముంచు నట్లు నేను కారు మబ్బులలో నీయొద్దకు వచ్చెదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా
10. యెహోవా మోషేతోనీవు ప్రజలయొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము; వారు తమ బట్టలు ఉదుకుకొని
11. మూడవనాటికి సిద్ధముగా నుండవలెను; మూడవనాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతముమీదికి దిగివచ్చును.
12. నీవు చుట్టు ప్రజలకు మేరను ఏర్పరచిమీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమీ ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను.
13. ఎవడును చేతితో దాని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను, మనుష్యుడుగాని మృగముగాని బ్రదుకకూడదు, బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతముయొద్దకు రావలె ననెను.
14. అప్పుడు మోషే పర్వతముమీదనుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకు కొనిరి.
15. అప్పుడతడుమూడవనాటికి సిద్ధముగా నుండుడి; ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను.
16. మూడవనాడు ఉదయమైనప్పుడు ఆ పర్వ తముమీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరు వణకిరి.
17. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాళెము లోనుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి.
18. యెహోవా అగ్నితో సీనాయి పర్వతముమీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై యుండెను. దాని ధూమము కొలిమి ధూమమువలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను.
19. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరముచేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను.
20. యెహోవా సీనాయి పర్వతముమీదికి, అనగా ఆ పర్వత శిఖరముమీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరముమీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను
21. అప్పుడు యెహోవాప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము.
22. మరియు యెహోవా వారిమీద పడకుండునట్లు యెహోవాయొద్దకు చేరు యాజకులు తమ్ముతామే పరిశుద్ధ పరచుకొన వలెనని మోషేతో చెప్పగా
23. మోషే యెహోవాతోప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు. నీవుపర్వతమునకు మేరలను ఏర్పరచి దాని పరిశుద్ధపరచ వలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను.
24. అందుకు యెహోవానీవు దిగి వెళ్లుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను. అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులును ప్రజలును ఆయన యొద్దకు వచ్చుటకు మేరను
25. మోషే ప్రజలయొద్దకు వెళ్లి ఆ మాట వారితో చెప్పెను.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 20
1. దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను.
2. నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పిం చితిని;
3. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
4. పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.
5. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు
6. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరములవరకు కరుణించు వాడనై యున్నాను.
7. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు.
8. విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము.
9. ఆరు దినములు నీవు కష్ట పడి నీ పని అంతయు చేయవలెను
10. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయ కూడదు.
11. ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్ర మించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.
12. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
13. నరహత్య చేయకూడదు.
14. వ్యభిచరింపకూడదు.
15. దొంగిలకూడదు.
16. నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.
17. నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు.నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు అని చెప్పెను.
18. ప్రజలందరు ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూర ధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి, భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి
19. నీవు మాతో మాటలాడుము మేము విందుము; దేవుడు మాతో మాటలాడిన యెడల మేము చనిపోవుదుము
20. అందుకు మోషేభయపడకుడి; మిమ్ము పరీక్షించుట కును, మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలు గుటకును, దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పెను.
21. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా
22. యెహోవా మోషేతో ఇట్లనెనుఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుమునేను ఆకాశమునుండి మీతో మాటలాడితినని మీరు గ్రహించితిరి.
23. మీరు నన్ను కొలుచుచు, వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసి కొనకూడదు.
24. మంటి బలిపీఠమును నాకొరకు చేసి, దానిమీద నీ దహన బలులను సమాధానబలులను నీ గొఱ్ఱలను నీ యెద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగానుంచు ప్రతి స్థలములోను నీయొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వ దించెదను.
25. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాని కట్టకూడదు; దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన యెడల అది అపవిత్రమగును.
26. మరియు నా బలిపీఠముమీద నీ దిగంబరత్వము కనబడక యుండునట్లు మెట్లమీదుగా దానిని ఎక్క కూడదు.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 21
1. నీవు వారికి నియమింపవలసిన న్యాయవిధులేవనగా
2. నీవు హెబ్రీయుడైన దాసుని కొనినయెడల వాడు ఆరు సంవత్సరములు దాసుడై యుండి యేడవ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును.
3. వాడు ఒంటిగా వచ్చినయెడల ఒంటిగానే వెళ్లవచ్చును. వానికి భార్య యుండిన యెడల వాని భార్య వానితోకూడ వెళ్లవచ్చును.
4. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వానివలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన యెడల ఆ భార్యయు ఆమె పిల్లలును ఆమె యజమానుని సొత్తగుదురుకాని వాడు ఒంటిగానే పోవలెను.
5. అయితే ఆ దాసుడునేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచు న్నాను; నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన యెడల
6. వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసి కొని రావలెను, మరియు వాని యజమానుడు తలుపునొద్ద కైనను ద్వారబంధ మునొద్దకైనను వాని తోడుకొనిపోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడైయుండును.
7. ఒకడు తన కుమార్తెను దాసిగా అమి్మనయెడల దాసు లైన పురుషులు వెళ్లిపోవునట్లు అది వెళ్లిపో కూడదు.
8. దానిని ప్రధానము చేసికొనిన యజమానుని దృష్టికి అది యిష్టురాలుకానియెడల అది విడిపింపబడునట్లు అవకాశము నియ్యవలెను; దాని వంచించి నందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు.
9. తన కుమారునికి దాని ప్రధానము చేసినయెడల కుమార్తెల విషయమైన న్యాయవిధిని బట్టి దానియెడల జరిగింపవలెను.
10. ఆ కుమా రుడు వేరొక దాని చేర్చుకొనినను, మొదటిదానికి ఆహార మును వస్త్రమును సంసారధర్మమును తక్కువ చేయ కూడదు.
11. ఈ మూడును దానికి కలుగజేయని యెడల అది ఏమియు ఇయ్యక స్వతంత్రురాలై పోవచ్చును.
12. నరుని చావగొట్టినవానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను.
13. అయితే వాడు చంపవలెనని పొంచి యుండకయే దైవికముగా వానిచేత ఆ హత్య జరిగిన యెడల వాడు పారిపోగల యొక స్థలమును నీకు నిర్ణ యించెదను.
14. అయితే ఒకడు తన పొరుగువానిమీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచినయెడల వాడు నా బలిపీఠము నాశ్రయించినను వాని లాగివేసి చంపవ లెను.
15. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయ ముగా మరణశిక్షనొందును.
16. ఒకడు నరుని దొంగిలించి అమి్మనను, తనయొద్ద నుంచు కొనినను, వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.
17. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయ ముగా మరణశిక్ష నొందును.
18. మనుష్యులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగు వానిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుటవలన వాడు చావక మంచముమీద పడియుండి
19. తరువాత లేచి తన చేతికఱ్ఱతో బయటికి వెళ్లి తిరుగుచుండిన యెడల, వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదుగాని అతడు పనిచేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగుచేయింపవలెను.
20. ఒకడు తన దాసుడైనను తన దాసియైనను చచ్చునట్లు కఱ్ఱతో కొట్టినయెడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును.
21. అయితే వాడు ఒకటి రెండు దినములు బ్రదికినయెడల ఆ ప్రతిదండన అతడు పొందడు, వాడు అతని సొమ్మేగదా.
22. నరులు పోట్లాడుచుండగా గర్భవతి యైన స్త్రీకి దెబ్బతగిలి ఆమెకు గర్భపాతమేగాక మరి ఏ హానియు రానియెడల హానిచేసినవాడు ఆ స్త్రీ పెనిమిటి వానిమీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధి పతులు తీర్మానించినట్లు దాని చెల్లింపవలెను.
23. హాని కలిగిన యెడల నీవు ప్రాణమునకు ప్రాణము,
24. కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు,
25. వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను.
26. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టినయెడల ఆ కంటి హానినిబట్టి వారిని స్వతంత్రునిగా పోనియ్యవలెను.
27. వాడు తన దాసుని పల్లయినను తన దాసి పల్లయినను ఊడగొట్టినయెడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులగా పోనియ్య వలెను.
28. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావపొడిచినయెడల నిశ్చయముగా రాళ్లతో ఆ యెద్దును చావకొట్టవలెను. దాని మాంసమును తినకూడదు, అయితే ఆ యెద్దు యజ మానుడు నిర్దోషియగును.
29. ఆ యెద్దు అంతకు ముందు పొడుచునది అని దాని యజమానునికి తెలుపబడినను, వాడు దాని భద్రము చేయకుండుటవలన అది పురుషునైనను స్త్రీనైనను చంపినయెడల ఆ యెద్దును రాళ్లతో చావగొట్టవలెను; దాని యజమానుడు మరణశిక్ష నొంద వలెను.
30. వానికి పరిక్రయధనము నియమింపబడినయెడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను.
31. అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను.
32. ఆ యెద్దు దాసునినైనను దాసినైనను పొడిచిన యెడల వారి యజమానునికి ముప్పది తులములవెండి చెల్లింపవలెను. మరియు ఆ యెద్దును రాళ్లతో చావకొట్ట వలెను.
33. ఒకడు గోతిమీది కప్పు తీయుటవలన, లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాని కప్పకపోవుటవలన, దానిలో ఎద్దయినను గాడిదయైనను పడిన యెడల
34. ఆ గోతి ఖామందులు ఆ నష్టమును అచ్చుకొనవలెను; వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలెను; చచ్చినది వానిదగును.
35. ఒకని యెద్దు వేరొకని యెద్దు చచ్చునట్లు దాని పొడి చినయెడల బ్రదికియున్న ఎద్దును అమి్మ దాని విలువను పంచుకొనవలెను, చచ్చిన యెద్దును పంచుకొనవలెను.
36. అయితే అంతకు ముందు ఆ యెద్దు పొడుచునది అని తెలియబడియు దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దునియ్యవలెను; చచ్చినది వానిదగును.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 22
1. ఒకడు ఎద్దునైనను గొఱ్ఱనైనను దొంగిలించి దాని అమి్మనను చంపినను ఆ యెద్దుకు ప్రతిగా అయిదు ఎద్దులను ఆ గొఱ్ఱకు ప్రతిగా నాలుగు గొఱ్ఱలను ఇయ్య వలెను.
2. దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడినయెడల అందువలన రక్తాపరాధ ముండదు.
3. సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టినయెడల వానికి రక్తాపరాధముండును; వాడు సరిగా సొమ్ము మరల చెల్లింపవలెను. వానికేమియు లేకపోయిన యెడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను.
4. వాడు దొంగిలినది ఎద్దయినను గాడిదయైనను గొఱ్ఱయైనను సరే అది ప్రాణముతో వానియొద్ద దొరికినయెడల రెండం తలు చెల్లింపవలెను.
5. ఒకడు చేనునైనను ద్రాక్షతోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసినయెడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా నియ్యవలెను.
6. అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుటవలన పంట కుప్పయైనను పంటపైరైనను చేనైనను కాలి పోయినయెడల అగ్ని నంటించినవాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను.
7. ఒకడు సొమ్మయినను సామానై నను జాగ్రత్తపెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుష్యుని యింట నుండి దొంగి లింపబడి ఆ దొంగ దొరికినయెడల వాడు దానికి రెండంతలు అచ్చుకొనవలెను;
8. ఆ దొంగ దొరకని యెడల ఆ యింటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసికొనెనో లేదో పరిష్కారమగుటకై దేవునియొద్దకు రావలెను.
9. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి, అనగా ఎద్దునుగూర్చి గాడిదనుగూర్చి గొఱ్ఱను గూర్చి బట్టనుగూర్చి పోయినదాని నొకడు చూచి యిది నాదని చెప్పిన దానిగూర్చి ఆ యిద్దరి వ్యాజ్యెము దేవుని యొద్దకు తేబడవలెను. దేవుడు ఎవనిమీద నేరము స్థాపిం చునో వాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొన వలెను.
10. ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొఱ్ఱనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్ప గించినమీదట, అది చచ్చినను హాని పొందినను, ఎవడును చూడకుండగా తోలుకొని పోబడినను,
11. వాడు తన పొరుగువాని సొమ్మును తీసికొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరిమధ్య నుండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను; ఆ నష్టమును అచ్చుకొననక్కరలేదు.
12. అది నిజముగా వానియొద్దనుండి దొంగిలబడినయెడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చు కొనవలెను.
13. అది నిజముగా చీల్చబడినయెడల వాడు సాక్ష్యముకొరకు దాని తేవలెను; చీల్చబడినదాని నష్టమును అచ్చుకొన నక్కరలేదు.
14. ఒకడు తన పొరుగువానియొద్ద దేనినైనను బదులు దీసి కొనిపోగా దాని యజమానుడు దానియొద్ద లేనప్పుడు, అది హానిపొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొన వలెను.
15. దాని యజమానుడు దానితో నుండిన యెడల దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. అది అద్దెదైన యెడల అది దాని అద్దెకు వచ్చెను.
16. ఒకడు ప్రధానము చేయబడని ఒక కన్యకను మరులుకొల్పి ఆమెతో శయ నించినయెడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసికొనవలెను.
17. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని యెడల వాడు కన్యకల ఓలిచొప్పున సొమ్ము చెల్లింపవలెను.
18. శకునము చెప్పుదానిని బ్రదుకనియ్యకూడదు.
19. మృగసంయోగముచేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను.
20. యోహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు.
21. పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు; మీరు ఐగుప్తు దేశ ములో పరదేశులై యుంటిరి గదా.
22. విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్ట కూడదు.
23. వారు నీచేత ఏ విధముగా నైనను బాధనొంది నాకు మొఱ పెట్టినయెడల నేను నిశ్చయముగా వారి మొఱను విందును.
24. నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తిచేత చంపించెదను, మీ భార్యలు విధవ రాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కు లేనివారగుదురు.
25. నా ప్రజలలో నీయొద్దనుండు ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చినయెడల వడ్డికిచ్చువానివలె వాని యెడల జరిగింప కూడదు, వానికి వడ్డికట్టకూడదు.
26. నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదవగా తీసికొనినయెడల సూర్యుడు అస్తమించువేళకు అది వానికి మరల అప్ప గించుము.
27. వాడు కప్పుకొనునది అదే. అది వాని దేహ మునకు వస్త్రము; వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను, వాడు నాకు మొఱపెట్టిన యెడల నేను విందును.
28. నీవు దేవుని నిందింపగూడదు, నీ ప్రజలలోని అధి కారిని శపింపకూడదు.
29. నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడవు చేయ కూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను.
30. అట్లే నీ యెద్దులను నీ గొఱ్ఱలను అర్పింపవలెను. ఏడు దినములు అది దాని తల్లియొద్ద ఉండవలెను. ఎనిమిదవ దినమున దానిని నాకియ్యవలెను.
31. మీరు నాకు ప్రతిష్ఠింపబడినవారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయ వలెను.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 23
1. లేనివార్తను పుట్టింపకూడదు; అన్యాయపు సాక్ష్య మును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు;
2. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పి వేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యెములో సాక్ష్యము పలుకకూడదు;
3. వ్యాజ్యెమాడువాడు బీదవాడైనను వానియెడల పక్షపాత ముగా నుండకూడదు.
4. నీ శత్రువుని యెద్దయినను గాడిదయైనను తప్పిపోవు చుండగా అది నీకు కనబడినయెడల అగత్యముగా దాని తోలుకొనివచ్చి వాని కప్పగింపవలెను.
5. నీవు నీ పగవాని గాడిద బరువుక్రింద పడియుండుట చూచి, దానినుండి తప్పింపకయుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాని విడిపింపవలెను.
6. దరిద్రుని వ్యాజ్యెములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు
7. అబద్ధమునకు దూరముగానుండుము; నిరప రాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు; నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను.
8. లంచము తీసి కొనకూడదు; లంచము దృష్టిగలవానికి గ్రుడ్డితనము కలుగజేసి, నీతిమంతుల మాట లకు అపార్థము చేయిం చును.
9. పరదేశిని బాధింపకూడదు; పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు; మీరు ఐగుప్తుదేశములో పరదేశులై యుంటిరిగదా.
10. ఆరు సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను.
11. ఏడవ సంవత్సరమున దానిని బీడు విడువవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్షతోట విషయములోను నీ ఒలీవతోట విషయములోను ఆలాగుననే చేయవలెను.
12. ఆరు దినములు నీ పనులు చేసి, నీ యెద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించునట్లు ఏడవ దినమున ఊరక యుండవలెను.
13. నేను మీతో చెప్పినవాటినన్నిటిని జాగ్రత్తగా గైకొనవలెను; వేరొక దేవుని పేరు ఉచ్చరింప కూడదు; అది నీ నోటనుండి రానియ్య తగదు.
14. సంవత్సరమునకు మూడుమారులు నాకు పండుగ ఆచ రింపవలెను.
15. పులియని రొట్టెల పండుగ నాచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నీవు ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టిచేతులతో కనబడకూడదు.
16. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలిపంట యొక్క కోతపండుగను, పొలములోనుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంత మందు ఫలసంగ్రహపు పండుగను ఆచరింపవలెను.
17. సంవ త్సరమునకు మూడుమారులు పురుషులందరు ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను.
18. నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింప కూడదు. నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయము వరకు నిలువ యుండకూడదు.
19. నీ భూమి ప్రథమ ఫలములో మొదటివాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు.
20. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను.
21. ఆయన సన్నిధిని జాగ్రత్తగానుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు; మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది.
22. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినయెడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునై యుందును.
23. ఎట్లనగా నా దూత నీకు ముందుగావెళ్లుచు, అమోరీ యులు హిత్తీయులు పెరిజ్జీయులు కనా నీయులు హివ్వీయులు యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించెదను.
24. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింప కూడదు; వారి క్రియలవంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి, వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను.
25. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్యనుండి రోగము తొలగించెదను.
26. కడుపు దిగబడునదియు గొడ్డుదియు నీ దేశము లోను ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసెదను.
27. నన్నుబట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసెదను. నీవు పోవు సర్వ దేశములవారిని ఓడ గొట్టి నీ సమస్త శత్రువులు నీ యెదుటనుండి పారిపోవునట్లు చేసెదను.
28. మరియు, పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను, అవి నీ యెదుటనుండి హివ్వీయులను కనానీయులను హిత్తీయులను వెళ్లగొట్టను.
29. దేశము పాడై అడవిమృగములు నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని ఒక్క సంవత్సరములోనే నీ యెదుటనుండి వెళ్లగొట్టను.
30. నీవు అభివృద్ధిపొంది ఆ దేశమును స్వాధీనపరచుకొనువరకు క్రమక్రమముగా వారిని నీయెదుటనుండి వెళ్లగొట్టెదను.
31. మరియు ఎఱ్ఱ సముద్రమునుండి ఫిలిష్తీయుల సముద్రము వరకును అరణ్యమునుండి నదివరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను, ఆ దేశ నివాసులను నీ చేతి కప్పగించెదను. నీవు నీ యెదుటనుండి వారిని వెళ్లగొట్టెదవు.
32. నీవు వారితో నైనను వారి దేవ తలతోనైనను నిబంధన చేసికొనవద్దు. నీవు వారి దేవతలను సేవించినయెడల అది నీకు ఉరియగును గనుక
33. వారు నీచేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశములో నివసింప కూడదు.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 24
1. మరియు ఆయన మోషేతో ఇట్లనెనునీవును, అహరోనును, నాదాబును, అబీహును, ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి.
2. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీ పింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు.
3. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరుయెహోవా చెప్పిన మాట లన్నిటి ప్రకారము చేసెదమని యేక శబ్దముతో ఉత్తరమిచ్చిరి.
4. మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు చొప్పున పండ్రెండు స్తంభములను కట్టి
5. ఇశ్రాయేలీయులలో ¸°వనస్థులను పంపగా వారు దహనబలుల నర్పించి యెహోవాకు సమా ధానబలులగా కోడెలను వధించిరి.
6. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసికొని పళ్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠముమీద ప్రోక్షించెను.
7. అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారుయెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి.
8. అప్పుడు మోషే రక్తమును తీసికొని ప్రజలమీద ప్రోక్షించిఇదిగో యీ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను.
9. తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు ఎక్కి పోయి
10. ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాద ములక్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువువంటిదియు ఆకాశ మండలపు తేజమువంటిదియు ఉండెను.
11. ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు; వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి.
12. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు కొండయెక్కి నాయొద్దకు వచ్చి అచ్చటనుండుము; నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతిపలకలను నీకిచ్చెదననగా
13. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండమీదికి ఎక్కెను.
14. అతడు పెద్దలను చూచిమేము మీ యొద్దకు వచ్చువరకు ఇక్కడనే యుండుడి; ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు; ఎవనికైనను వ్యాజ్యెమున్నయెడల వారియొద్దకు వెళ్లవచ్చునని వాం
15. మోషే కొండమీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను.
16. యెహోవా మహిమ సీనాయి కొండమీద నిలిచెను; మేఘము ఆరు దినములు దాని కమ్ముకొనెను; ఏడవ దినమున ఆయన ఆ మేఘములోనుండి మోషేను పిలిచినప్పుడు
17. యెహోవా మహిమ ఆ కొండ శిఖరముమీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీయుల కన్ను లకు కనబడెను.
18. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవే శించి కొండమీదికి ఎక్కెను. మోషే ఆ కొండమీద రేయింబవళ్ళు నలుబది దినములుండెను.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 25
1. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
2. నాకు ప్రతిష్ఠార్పణ తీసికొనిరండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాని తీసికొనవలెను.
3. మీరు వారియొద్ద తీసికొన వలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి,
4. నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపునార, మేకవెండ్రుకలు,
5. ఎరుపురంగు వేసిన పొట్టేళ్లతోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱలు,
6. ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమున కును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభార ములు,
7. లేతపచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే.
8. నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను.
9. నేను నీకు కను పరచువిధముగా మందిరముయొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను.
10. వారు తుమ్మకఱ్ఱతో నొక మందసమును చేయవలెను. దాని పొడుగు రెండుమూరలునర, దాని వెడల్పు మూరెడు నర, దానియెత్తు మూరెడునర
11. దానిమీద మేలిమి బంగారురేకు పొదిగింపవలెను; లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను; దానిమీద బంగారు జవను చుట్టు కట్ట వలెను.
12. దానికి నాలుగు బంగారు ఉంగరములను పోత పోసి, ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలెను.
13. తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి
14. వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకఱ్ఱలను దూర్చవలెను.
15. ఆ మోతకఱ్ఱలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను. వాటిని దానియొద్దనుండి తీయకూడదు;
16. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనముల నుంచవలెను.
17. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయ వలెను. దాని పొడుగు రెండు మూరలునర దాని వెడల్పు మూరెడునర.
18. మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క రెండు కొనలను నకిషిపనిగా చేయవలెను.
19. ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను
20. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణా పీఠముతట్టు నుండవలెను. నీవు ఆ కరుణా పీఠమును ఎత్తి ఆ మందసముమీద నుంచ వలెను.
21. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను.
22. అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణా పీఠముమీద నుండియు, శాసనములుగల మందసము మీద నుండు రెండు కెరూబుల మధ్య నుండియు, నేను ఇశ్రా యేలీయుల నిమిత్తము మీ కాజ్ఞాపించ
23. మరియు నీవు తుమ్మకఱ్ఱతో నొక బల్ల చేయవలెను. దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు ఒక మూర దాని యెత్తు మూరెడునర.
24. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేయింప వలెను.
25. దానికి చుట్టు బెత్తెడు బద్దెచేసి దాని బద్దెపైని చుట్టును బంగారు జవ చేయవలెను.
26. దానికి నాలుగు బంగారు ఉంగరములను చేసి దాని నాలుగు కాళ్లకుండు నాలుగు మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను
27. బల్ల మోయుటకు మోతకఱ్ఱలు ఉంగరములును బద్దెకు సమీపముగా నుండవలెను.
28. ఆ మోతకఱ్ఱలు తుమ్మకఱ్ఱతో చేసి వాటిమీద బంగారు రేకు పొదిగింపవలెను; వాటితో బల్లమోయబడును.
29. మరియు నీవు దాని పళ్లెములను ధూపార్తులను గిన్నెలను పానీయార్పణముకు పాత్ర లను దానికి చేయవలెను; మేలిమి బంగారుతో వాటిని చేయ వలెను.
30. నిత్యమును నా సన్నిధిని సన్నిధిరొట్టెలను ఈ బల్లమీద ఉంచవలెను.
31. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను; నకిషిపనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయ వలెను; దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమైయుండవలెను.
32. దీప వృక్షముయొక్క ఒక ప్రక్కనుండి మూడుకొమ్మలు, దీపవృక్షముయొక్క రెండవ ప్రక్కనుండి మూడు కొమ్మలు, అనగా దాని ప్రక్కలనుండి ఆరుకొమ్మలు నిగుడవలెను.
33. ఒక కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు; అట్లు దీపవృక్షమునుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను.
34. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన నాలుగు కలశములును వాటి మొగ్గలును వాటి పువ్వులును ఉండవలెను,
35. దీపవృక్ష ప్రకాండమునుండి నిగుడు ఆరుకొమ్మలకు దాని రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గచొప్పున ఉండవలెను.
36. వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును; అదంతయు మేలిమి బంగారుతో చేయ బడిన ఏకాండమైన నకిషి పనిగా ఉండవలెను.
37. నీవు దానికి ఏడు దీపములను చేయవలెను. దాని యెదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను.
38. దాని కత్తెర దాని కత్తెరచిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను.
39. ఆ ఉపకరణములన్ని నలుబది వీసెల మేలిమి బంగారుతో చేయవలెను.
40. కొండమీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్తపడుము.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 26
1. మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పనియైన కెరూబులు గలవాటినిగా చేయవలెను.
2. ప్రతి తెర పొడుగు ఇరువది యెనిమిది మూరలు; ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు. ఆ తెరలన్నిటికి ఒకటే కొలత.
3. అయిదు తెరలను ఒక దానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను.
4. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలినూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పునందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను.
5. ఒక తెరలో ఏబది కొలుకులను చేసి, ఆ కొలుకులు ఒకదాని నొకటి తగులుకొనునట్లు ఆ రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయ వలెను.
6. మరియు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీలచేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను; అది ఒకటే మందిరమగును.
7. మరియు మందిరముపైని గుడారముగా మేకవెండ్రుకలతో తెరలు చేయవలెను; పదకొండు తెరలను చేయవలెను.
8. ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు, వెడల్పు నాలుగు మూరలు, పదకొండు తెరల కొలత ఒక్కటే.
9. అయిదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను ఒక దానికొకటి కూర్పవలెను. ఆరవ తెరను గుడారపు ఎదుటిభాగమున మడవవలెను.
10. తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున ఏబది కొలుకులను రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయవలెను.
11. మరియు ఏబది యిత్తడి గుండీ లను చేసి యొకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలు కులకు తగిలించి దాని కూర్పవలెను.
12. ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడుభాగము, అనగా మిగిలిన సగము తెర, మందిరము వెనుక ప్రక్కమీద వ్రేలాడవలెను.
13. మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరయు, ఆ ప్రక్కను ఒక మూరయు, మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కలమీద వ్రేలాడవలెను.
14. మరియు ఎఱ్ఱరంగువేసిన పొట్టేళ్ల తోళ్లతో పై కప్పును దానికిమీదుగా సముద్ర వత్సల తోళ్లతో పై కప్పును చేయవలెను.
15. మరియు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేయవలెను.
16. పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర యుండవలెను.
17. ప్రతి పలకలో ఒకదాని కొకటి సరియైన రెండు కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికి చేసిపెట్టవలెను.
18. ఇరువది పలకలు కుడివైపున, అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను.
19. మరియు నొక్కొక్క పలకక్రింద దాని దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ యిరువది పలకల క్రింద నలువది వెండి దిమ్మలను చేయవలెను.
20. మందిరపు రెండవ ప్రక్కను, అనగా ఉత్తరదిక్కున,
21. ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మలు ఇరువది పలకలును వాటి నలు వది వెండి దిమ్మలు ఉండవలెను.
22. పడమటితట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలను చేయవలెను.
23. మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేయవలెను.
24. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను, అవి రెండు మూలలకుండును.
25. పలకలు ఎనిమిది; వాటి వెండిదిమ్మలు పదునారు; ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మ లుండవలెను.
26. తుమ్మకఱ్ఱతో అడ్డ కఱ్ఱలను చేయవలెను. మందిరము యొక్క ఒక ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును
27. మందిరముయొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును పడమటి వైపున మందిరముయొక్క ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును ఉండవలెను;
28. ఆ పలకల మధ్యనుండు నడిమి అడ్డ కఱ్ఱ ఈ కొసనుండి ఆ కొసవరకు చేరి యుండవలెను.
29. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డ కఱ్ఱలుండు వాటి ఉంగర ములను బంగారుతో చేసి అడ్డ కఱ్ఱలకును బంగారురేకును పొదిగింపవలెను.
30. అప్పుడు కొండ మీద నీకు కనుపరచ బడినదాని పోలికచొప్పున మందిరమును నిలువబెట్టవలెను.
31. మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములుగల ఒక అడ్డ తెరను పేనిన సన్న నారతో చేయవలెను. అది చిత్ర కారుని పనియైన కెరూబులు గలదిగా చేయవలెను.
32. తుమ్మకఱ్ఱతో చేయబడి బంగారురేకు పొదిగిన నాలుగు స్తంభములమీద దాని వేయవలెను; దాని వంకులు బంగారువి వాటి దిమ్మలు వెండివి.
33. ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెరలోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలమును అతిపరిశుద్ధస్థలమును వేరుచేయును.
34. అతిపరిశుద్ధస్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము నుంచవలెను.
35. అడ్డతెర వెలుపల బల్లను ఆ బల్లయెదుట దక్షిణపు వైపుననున్న మందిరముయొక్క యుత్తరదిక్కున దీపవృక్షమును ఉంచ వలెను.
36. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్న నారతో చిత్రకారునిపనియైన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను.
37. ఆ తెరకు అయిదు స్తంభములను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారురేకు పొదిగింప వలెను. వాటి వంపులు బంగారువి వాటికి అయిదు ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 27
1. మరియు అయిదు మూరల పొడుగు అయిదు మూరల వెడల్పుగల బలిపీఠమును తుమ్మకఱ్ఱతో నీవు చేయ వలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను; దాని యెత్తు మూడు మూరలు.
2. దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలెను; దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను; దానికి ఇత్తడి రేకు పొదిగింప వలెను.
3. దాని బూడిదె ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉప కరణములన్నియు ఇత్తడితో చేయవలెను.
4. మరియు వలవంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను.
5. ఆ వలమీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమివరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాని నుంచవలెను.
6. మరియు బలిపీఠముకొరకు మోతకఱ్ఱలను చేయవలెను. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను.
7. ఆ మోతకఱ్ఱలను ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకఱ్ఱలు దాని రెండుప్రక్కల నుండ వలెను.
8. పలకలతో గుల్లగా దాని చేయవలెను; కొండమీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలెను.
9. మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున, అనగా దక్షిణదిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగుగలదై పేనిన సన్న నార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను.
10. దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి; ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.
11. అట్లే పొడుగులో ఉత్తర దిక్కున నూరు మూరల పొడుగుగల యవనికలుండ వలెను. దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి. ఆ స్తంభముల వంకులును వాటి పెండె
12. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు ఏబది మూరల యవనికలుండవలెను; వాటి స్తంభ ములు పది వాటి దిమ్మలు పది.
13. తూర్పువైపున, అనగా ఉదయదిక్కున ఆవరణపు వెడల్పు ఏబది మూరలు.
14. ఒక ప్రక్కను పదునైదు మూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.
15. రెండవ ప్రక్కను పరునైదుమూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలును మూడు.
16. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల యిరువది మూరల తెర యుండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను; వాటి స్తంభములు నాలుగు వాటి దిమ్మలు నాలుగు.
17. ఆవరణముచుట్టున్న స్తంభములన్నియు వెండి పెండెబద్దలు కలవి; వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఇత్తడివి.
18. ఆవరణపు పొడుగు నూరు మూరలు; దాని వెడల్పు ఏబదిమూరలు దాని యెత్తు అయిదు మూరలు; అవి పేనిన సన్ననారవి వాటి దిమ్మలు ఇత్తడివి.
19. మందిరసంబంధమైన సేవోపకర ణములన్నియు మేకులన్నియు ఆవరణపు మేకులన్నియు ఇత్తడివై యుండవలెను.
20. మరియు దీపము నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలీ యుల కాజ్ఞాపించుము.
21. సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులును సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు యెహోవా సన్నిధిని దాని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరములవరకు నిత్యమైన కట్టడ.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 28
1. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము.
2. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను.
3. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేకహృదయులందరికి ఆజ్ఞ ఇమ్ము.
4. పతకము ఏఫోదు నిలువు టంగీ విచిత్ర మైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై యుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను.
5. వారు బంగారును నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలును సన్ననారను తీసికొని
6. బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములుగల ఏఫోదును పేనిన సన్న నారతోను చిత్ర కారునిపనిగా చేయవలెను.
7. రెండు అంచులయందు కూర్చబడు రెండు భుజఖండములు దానికుండవలెను; అట్లు అది సమకూర్పబడియుండును.
8. మరియు ఏఫోదు మీదనుండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోను నీలధూమ్ర రక్తవర్ణములుగల నూలుతోను పేనిన సన్ననారతోను కుట్టవలెను.
9. మరియు నీవు రెండు లేత పచ్చలను తీసికొని వాటిమీద ఇశ్రాయేలీయుల పేరులను, అనగా వారి జనన క్రమముచొప్పున
10. ఒక రత్నముమీద వారి పేళ్లలో ఆరును, రెండవ రత్నము మీద తక్కిన ఆరుగురి పేళ్లను చెక్కింపవలెను.
11. ముద్ర మీద చెక్కబడిన వాటివలె చెక్కెడివాని పనిగా ఆ రెండు రత్నములమీద ఇశ్రాయేలీయుల పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను.
12. అప్పుడు ఇశ్రా యేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ రెండు రత్నములను ఏఫోదు భుజములమీద ఉంచవలెను అట్లు జ్ఞాపకముకొరకు అహరోను తన రెండు భుజములమీద యెహోవా స
13. మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో రెండు గొలుసులను చేయవలెను;
14. సూత్రములవలె అల్లికపనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను.
15. మరియు చిత్రకారుని పనిగా న్యాయవిధాన పతకము చేయవలెను. ఏఫోదుపనివలె దాని చేయవలెను; బంగారు తోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలు తోను పేనిన సన్ననారతోను దాని చేయవలెను.
16. అది మడవబడి చచ్చౌకముగా నుండవలెను; అది జేనెడు పొడుగు జేనెడు వెడల్పుగలదై యుండవలెను.
17. దానిలో నాలుగు పంక్తుల రత్నములుండునట్లు రత్న ముల జవలను చేయవలెను. మాణిక్య గోమేధిక మరకతములుగల పంక్తి మొదటిది;
18. పద్మరాగ నీల సూర్యకాంతములుగల పంక్తి రెండవది;
19. గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలములుగల పంక్తి మూడవది;
20. రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను.
21. ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేరులుగలవై వారి పేరులచొప్పున పండ్రెండుండవలెను. ముద్రమీద చెక్కినవాటివలె వారిలో ప్రతివాని పేరు చొప్పున పండ్రెండు గోత్రముల పేరులు ఉండవలెను.
22. మరియు ఆ పతకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను.
23. పతకమునకు రెండు బంగారు ఉంగరములు చేసి
24. ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొసలయందు తగిలించి, పతకపు కొసలనున్న రెండు ఉంగరములలో అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలింపవలెను.
25. అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు రెండు జవలకు తగిలించి ఏఫోదు నెదుట దాని భుజములమీద కట్టవలెను.
26. మరియు నీవు బంగారుతో రెండు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకములోపలి అంచున దాని రెండు కొసలకు వాటిని తగిలింపవలెను.
27. మరియు నీవు రెండు బంగారు ఉంగర ములుచేసి ఏఫోదు విచిత్రమైన దట్టిపైగా దాని కూర్పు నొద్ద, దాని యెదుటి ప్రక్కకు దిగువను, ఏఫోదు రెండు భుజభాగములకు వాటిని తగిలింపవలెను.
28. అప్పుడు పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికిపైగా నుండునట్లును అది ఏఫోదునుండి వదలక యుండునట్లును వారు దాని ఉంగర ములకు ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట
29. అట్లు అహరోను పరిశుద్ధస్థలములోనికి వెళ్లు నప్పుడు అతడు తన రొమ్ముమీద న్యాయవిధాన పతకములోని ఇశ్రాయేలీయుల పేళ్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెన
30. మరియు నీవు న్యాయవిధాన పతకములో ఊరీము తుమీ్మము అనువాటిని ఉంచ వలెను; అహరోను యెహోవా సన్నిధికి వెళ్లునప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయవిధానమును నిత్యము భరించును.
31. మరియు ఏఫోదు నిలువుటంగీని కేవలము నీలిదారముతో కుట్టవలెను.
32. దానినడుమ తల దూరుటకు రంధ్రము ఉండవలెను. అది చినగకుండునట్లు కంఠ కవచ రంధ్రమువలె దాని రంధ్రముచుట్టు నేతపనియైన గోటు ఉండవలెను.
33. దాని అంచున దాని అంచులచుట్టు నీల ధూమ్ర రక్తవర్ణములుగల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువు టంగీ చుట్టు తగిలింపవలెను.
34. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మపండును ఆ నిలువు టంగీ క్రింది అంచున చుట్టు ఉండవలెను.
35. సేవచేయునప్పుడు అహరోను దాని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించునప్పుడు అతడు చావకయుండునట్లు దాని ధ్వని వినబడవలెను.
36. మరియు నీవు మేలిమి బంగారు రేకుచేసి ముద్ర చెక్కునట్లు దానిమీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను.
37. అది పాగామీద ఉండునట్లు నీలి సూత్రముతో దాని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను.
38. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధ మైనవాటికి తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసట ఉండవలెను; వారు యెహోవా సన్నిధిని అంగీక రింపబడునట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను.
39. మరియు సన్న నారతో చొక్కాయిని బుట్టాపనిగా చేయవలెను. సన్న నారతో పాగాను నేయవలెను; దట్టిని బుట్టాపనిగా చేయవలెను.
40. అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను; వారికి దట్టీలను చేయవలెను; వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళ్లాయిలను వారికి చేయవలెను.
41. నీవు నీ సహోదరు డైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను; వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకముచేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచ వలెను.
42. మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను.
43. వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించునప్పుడైనను, పరిశుద్ధస్థలములో సేవచేయుటకు బలిపీఠమును సమీపించునప్పుడైనను, వారు దోషులై చావక యుండునట్లు అది అహరోనుమీదను అతని కుమారులమీదను ఉండవలెను. ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికిని నిత్యమైన కట్టడ.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 29
1. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించు టకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా
2. ఒక కోడెదూడను కళంకములేని రెండు పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసి కొనుము.
3. గోధుమపిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి, ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొట్టేళ్లను తీసికొనిరావలెను.
4. మరియు నీవు అహరోనును అతని కుమా రులను ప్రత్యక్షపు గుడార ముయొక్క ద్వారము దగ్గరకు తీసికొనివచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి
5. ఆ వస్త్రములను తీసికొని చొక్కాయిని ఏఫోదు నిలువుటంగిని ఏఫోదును పతక మును అహరోనుకు ధరింపచేసి, ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి
6. అతని తలమీద పాగాను పెట్టి ఆ పాగామీద పరిశుద్ధ కిరీటముంచి
7. అభిషేక తైలమును తీసికొని అతని తలమీద పోసి అతని నభిషేకింపవలెను.
8. మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను.
9. అహరోనుకును అతని కుమారులకును దట్టినికట్టి వారికి కుళ్లాయిలను వేయింపవలెను; నిత్యమైన కట్టడనుబట్టి యాజకత్వము వారికగును. అహరోనును అతని కుమారులను ఆలాగున ప్రతి
10. మరియు నీవు ప్రత్యక్షపు గుడారము నెదుటికి ఆ కోడెను తెప్పింపవలెను అహరోనును అతని కుమారులును కోడె తలమీద తమ చేతుల నుంచగా
11. ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను.
12. ఆ కోడె రక్తములో కొంచెము తీసికొని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ములమీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠపు టడుగున పోయ వలెను.
13. మరియు ఆంత్రములను కప్పుకొను క్రొవ్వం తటిని కాలేజముమీది వపను రెండు మూత్ర గ్రంథులను వాటిమీది క్రొవ్వును నీవు తీసి బలిపీఠముమీద దహింపవలెను.
14. ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను, అది పాపపరిహారార్థమైన బలి.
15. నీవు ఆపొట్టేళ్లలో ఒకదాని తీసికొనవలెను. అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచగా
16. నీవు ఆ పొట్టేలును వధించి దాని రక్తము తీసి బలిపీఠముచుట్టు దాని ప్రోక్షింపవలెను.
17. అంతట నీవు ఆ పొట్టేలును దాని అవయవములను దేనికి అది విడదీసి దాని ఆంత్రములను దాని కాళ్లను కడిగి దాని అవయవములతోను తలతోను చేర్చి
18. బలిపీఠముమీద ఆ పొట్టేలంతయు దహింపవలెను; అది యెహోవాకు దహనబలి, యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము.
19. మరియు నీవు రెండవ పొట్టేలును తీసికొనవలెను. అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచగా
20. ఆ పొట్టేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి, ఆహరోను కుడిచెవి కొనమీదను అతని కుమారుల కుడి చెవుల కొనమీదను, వారి కుడిచేతి బొట్టన వ్రేళ్లమీదను,వారి కుడికాలి బొట్టనవ్రేళ్లమీదను చమిరి బలిపీఠముమీద చుట్టు ఆ రక్తమును ప్రోక్షింపవలెను.
21. మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోనుమీదను, అతని వస్త్రముల మీదను, అతనితోనున్న అతని కుమారులమీదను, అతని కుమారుల వస్త్రములమీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును అతని వస్త్రములును అతనితోనున్న అతని కుమారులును అతని కుమారుల వస్త్రములును ప్రతిష్ఠితము లగును.
22. మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు గనుక దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును కాలేజముమీది వపను రెండు మూత్రగ్రంథులను వాటిమీది క్రొవ్వును కుడి జబ్బను
23. ఒక గుండ్రని రొట్టెను నూనెతో వండిన యొక భక్ష్యమును యెహోవా యెదుటనున్న పొంగనివాటిలో పలచని ఒక అప్పడమును నీవు తీసికొని
24. అహరోను చేతులలోను అతని కుమారుల చేతులలోను వాటినన్నిటిని ఉంచి, అల్లాడింపబడు నైవే ద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను.
25. తరువాత నీవు వారి చేతులలో నుండి వాటిని తీసికొని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహనబలిగా వాటిని బలిపీఠముమీద దహింపవలెను. అది యెహోవాకు హోమము.
26. మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలునుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడింప వలెను; అది నీ వంతగును.
27. ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలులో అనగా అహరోనుదియు అతని కుమారులదియునైన దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలెను.
28. అది ప్రతిష్టార్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇశ్రాయేలీయులనుండి అహ రోనుకును అతని కుమారులకు నగును. అది ఇశ్రాయేలీయులు అర్పించు సమాధానబలులలోనుండి తాము చేసిన
29. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములును అతని తరువాత అతని కుమారులవగును; వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొన వలెను.
30. అతని కుమారులలో నెవడు అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధస్థలములో సేవచేయుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడు ఏడు దినములు వాటిని వేసికొనవలెను.
31. మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసికొని పరి శుద్ధస్థలములో దాని మాంసమును వండవలెను.
32. అహరోనును అతని కుమారులును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారముదగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలెను.
33. వారిని ప్రతిష్ఠ చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటివలన ప్రాయశ్చిత్తము చేయబడెనో వాటిని వారు తినవలెను; అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తినకూడదు.
34. ప్రతిష్ఠితమైన మాంసములోనేమి ఆ రొట్టె లలో నేమి కొంచెమైనను ఉదయమువరకు మిగిలి యుండిన యెడల మిగిలినది అగ్ని చేత దహింపవ లెను; అది ప్రతిష్ఠితమైనది గనుక దాని తినవలదు.
35. నేను నీ కాజ్ఞాపించిన వాటన్నిటినిబట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకును చేయవలెను. ఏడు దినములు వారిని ప్రతిష్ఠపరచవలెను.
36. ప్రాయశ్చి త్తము నిమిత్తము నీవు ప్రతిదినమున ఒక కోడెను పాప పరిహారార్థబలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలన దానికి పాపపరిహారార్థబలి నర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను.
37. ఏడుదినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాశ్చిత్తముచేసి దాని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతిపరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును.
38. నీవు బలిపీఠముమీద నిత్యమును అర్పింపవలసిన దేమనగా, ఏడాదివి రెండు గొఱ్ఱపిల్లలను ప్రతిదినము ఉదయమందు ఒక గొఱ్ఱపిల్లను
39. సాయంకాలమందు ఒక గొఱ్ఱపిల్లను అర్పింపవలెను.
40. దంచితీసిన ముప్పావు నూనెతో కలిపిన పదియవవంతు పిండిని పానీయార్పణ ముగా ముప్పావు ద్రాక్షారసమును మొదటి గొఱ్ఱపిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు రెండవ గొఱ్ఱపిల్లను అర్పింపవలెను.
41. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగునట్లు ఉదయకాల మందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీని నర్పింపవలెను.
42. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారముయొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబలి. నీతో మాటలాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలిసికొందును.
43. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీ యులను కలిసికొందును; అది నా మహిమవలన పరిశుద్ధపరచబడును.
44. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు అహరో నును అతని కుమారులను పరిశుద్ధపరచెదను.
45. నేను ఇశ్రాయేలీ యుల మధ్య నివసించి వారికి దేవుడనై యుందును.
46. కావున నేను వారి మధ్య నివసించునట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహో వాను నేనే అని వారు తెలిసికొందురు. నేను వారి దేవుడనైన యెహోవాను.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 30
1. మరియు ధూపమువేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను తుమ్మకఱ్ఱతో దాని చేయవలెను.
2. దాని పొడుగు ఒక మూర దాని వెడల్పు ఒక మూర. అది చచ్చౌకముగా నుండవలెను. దాని యెత్తు రెండు మూరలు దాని కొమ్ములు దానితో ఏకాండమై యుండవలెను.
3. దాని పైభాగమునకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేయవలెను.
4. దాని జవకు దిగువను దానికి రెండు బంగారు ఉంగరములు చేయవలెను; దాని రెండు ప్రక్కలయందలి దాని రెండు మూలలమీద వాటిని ఉంచవలెను.
5. అవి దాని మోయు మోతకఱ్ఱలకు స్థలములు. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారురేకు పొదిగింపవలెను.
6. సాక్ష్యపు మందసము నొద్దనుండు అడ్డతెర యెదుట, అనగా శాసనములమీది కరుణాపీఠము నెదుట నీవు దానిని ఉంచవలెను; అక్కడ నేను నిన్ను కలిసికొందును.
7. అహరోను ప్రతిదినము ప్రొద్దున దానిమీద పరిమళద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్క పరచునప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలెను.
8. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించునప్పుడు దానిమీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము.
9. మీరు దానిమీద అన్యధూపమునైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు; పానీ యమునైనను దానిమీద పోయకూడదు.
10. మరియు అహరోను సంవత్సరమున కొకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థబలి రక్తమువలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సర మునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది.
11. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను.
12. వారు లెక్కింప బడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణపరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. ఆలాగు చేసినయెడల నీవు వారిని లెక్కించునప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు.
13. వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధస్థలముయొక్క తులమునుబట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము యిరువది చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్ఠార్పణ.
14. ఇరువది సంవత్సరములు గాని అంతకంటె యెక్కువ వయస్సు గాని గలవారై లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ నియ్యవలెను.
15. అది మీ ప్రాణములకు పరిక్రయధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చునప్పుడు ధనవంతుడు అర తులముకంటె ఎక్కువ ఇయ్యకూడదు. బీదవాడు తక్కువ ఇయ్య కూడదు.
16. నీవు ఇశ్రాయేలీయుల యొద్దనుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసికొని ప్రత్యక్షపు గుడారముయొక్క సేవనిమిత్తము దాని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థ ముగా నుండును.
17. మరియు యెహోవా మోషేతో ఇట్లనెనుకడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటనుచేసి
18. ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను.
19. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులును తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను.
20. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడును సేవచేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చునప్పుడును తాము చావక యుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను.
21. తాము చావక యుండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొన వలెను. అది వారికి, అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును.
22. మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో
23. పరిశుద్ధస్థల సంబంధమైన తులముచొప్పున, అచ్చమైన గోపరసము ఐదువందల తులములును సుగంధముగల లవంగిపట్ట సగము, అనగా రెండువందల ఏబది తుల ముల యెత్తును
24. నిమ్మగడ్డి నూనె రెండువందల ఏబది తులముల యెత్తును, లవంగిపట్ట ఐదువందల తులము లును ఒలీవ నూనె సంభారమును మూడు పళ్లును తీసికొని
25. వాటిని ప్రతిష్ఠాభిషేక తైలము, అనగా సుగంధద్రవ్యమేళకుని పనియైన పరిమళసంభార ముగా చేయవలెను. అది ప్రతిష్ఠాభిషేక తైలమగును.
26. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును సాక్ష్యపు మందసమును
27. బల్లను దాని ఉపకరణములన్నిటిని దీప వృక్షమును దాని ఉపకరణములను ధూపవేదికను
28. దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను అభిషేకించి
29. అవి అతిపరి శుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతివస్తువు ప్రతిష్ఠితమగును.
30. మరియు అహరోనును అతని కుమారులును నాకు యాజకులై యుండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింప వలెను.
31. మరియు నీవు ఇశ్రాయేలీయులతోఇది మీ తరతరములకు నాకు ప్రతిష్ఠాభిషేకతైలమై యుండవలెను;
32. దానిని నర శరీరము మీద పోయకూడదు; దాని మేళనము చొప్పున దాని వంటి దేనినైనను చేయ కూడదు. అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠిత మైనదిగా నుండవలెను.
33. దానివంటిది కలుపువాడును అన్యునిమీద దానిని పోయువాడును తన ప్రజలలోనుండి కొట్టివేయబడవలెనని చెప్పుము.
34. మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు పరిమళ ద్రవ్యములను, అనగా జటామాంసి గోపి చందనము గంధపుచెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసికొని
35. వాటితో ధూపద్రవ్యమును చేయవలెను; అది సుగంధద్రవ్యమేళకుని పనిచొప్పున కలపబడి, ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూపసంభారము.
36. దానిలో కొంచెము పొడిచేసి నేను నిన్ను కలిసికొను ప్రత్యక్షపు గుడారము లోని సాక్ష్యపు మందసమునెదుట దాని నుంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండ వలెను.
37. నీవు చేయవలసిన ఆ ధూపద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసికొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను.
38. దాని వాసన చూచుటకు దానివంటిది చేయువాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 31
1. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను
2. చూడుము; నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగల వానిని పిలిచితిని.
3. విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై
4. రత్నములను సాన బెట్టుటకును కఱ్ఱనుకోసి చెక్కుటకును
5. సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞానవిద్యా వివేకములును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి యున్నాను.
6. మరియు నేను దాను గోత్రములోని అహీ సామాకు కుమారుడైన అహోలీయాబును అతనికి తోడు చేసి తిని. నేను నీకాజ్ఞాపించినవన్నియు చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి యున్నాను.
7. ప్రత్యక్షపు గుడారమును సాక్ష్యపు మందసమును దానిమీదనున్న కరుణాపీఠమును ఆ గుడారపు ఉప కరణములన్నిటిని
8. బల్లను దాని ఉపకరణములను నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటిని ధూపవేదికను
9. దహన బలిపీఠ మును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను
10. యాజకసేవచేయునట్లు సేవా వస్త్రములను యాజకుడైన అహరోనుయొక్క ప్రతిష్ఠిత వస్త్రములను అతని కుమారుల వస్త్రములను
11. అభిషేక తైలమును పరిశుద్ధ స్థలముకొరకు పరిమళ ధూపద్రవ్యములను నేను నీ కాజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను.
12. మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ఇశ్రాయేలీయులతోనిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరింపవలెను;
13. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలిసికొనునట్లు అది మీ తర తరములకు నాకును మీకును గురుతగును.
14. కావున మీరు విశ్రాంతిదినము నాచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము; దానిని అపవిత్ర పరచువాడు తన ప్రజల లోనుండి కొట్టివేయబడును.
15. ఆరు దినములు పనిచేయ వచ్చును; ఏడవదినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతిదినము. ఆ విశ్రాంతిదినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నొందును.
16. ఇశ్రాయేలీయులు తమ తర తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను; అది నిత్యనిబంధన.
17. నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడును గురుతైయుండును; ఏలయనగా ఆరుదినములు యెహోవా భూమ్యాకాశములను సృజించి యేడవదినమున పని మాని విశ్రమించెనని చెప్పుము.
18. మరియు ఆయన సీనాయి కొండమీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసన ములుగల రెండు పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 32
1. మాషే కొండదిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చిలెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకొరకు చేయుము. ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని అతనితో చెప్పిరి.
2. అందుకు అహరోనుమీ భార్యలకు మీ కుమా రులకు మీ కుమార్తెలకు చెవుల నున్న బంగారు పోగులను తీసి నాయొద్దకు తెండని వారితో చెప్పగా
3. ప్రజలందరు తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి.
4. అతడు వారియొద్ద వాటిని తీసికొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారుఓ ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి.
5. అహరోను అది చూచి దాని యెదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోనురేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా
6. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధానబలుల నర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి.
7. కాగా యెహోవా మోషేతో ఇట్లనెనునీవు దిగి వెళ్లుము; ఐగుప్తుదేశమునుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి.
8. నేను వారికి నియమించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయి తమకొరకు పోతపోసిన దూడను చేసికొని దానికి సాగిలపడి బలినర్పించిఓయి ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశమునుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను.
9. మరియు యెహోవా ఇట్లనెనునేను ఈ ప్రజలను చూచియున్నాను; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు.
10. కావున నీవు ఊరకుండుము; నా కోపము వారిమీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసెదనని మోషేతో చెప్పగా
11. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొనియెహోవా, నీవు మహాశక్తివలన బాహుబలము వలన ఐగుప్తు దేశములోనుండి రప్పించిన నీ ప్రజలమీద నీ కోపము మండనేల?
12. ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమిమీదనుండి వారిని నశింపచేయునట్లును కీడుకొరకే వారిని తీసికొని పోయెనని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను? నీ కోపాగ్నినుండి మళ్లుకొని నీవు
13. నీ సేవకులైన అబ్రాహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసికొనుము. నీవు వారితోఆకాశనక్షత్రములవలె మీ సంతానము అభివృద్ధిజేసి నేను చెప్పిన యీ సమస్తభూమిని మీ సంతానమున కిచ్చెదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణముచేసి చెప్పితివనెను.
14. అంతట యెహోవా తన ప్రజలకు చేసెదనని చెప్పిన కీడునుగూర్చి సంతాపపడెను.
15. మోషే శాసనములుగల రెండు పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి; అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయ బడియుండెను.
16. ఆ పలకలు దేవుడు చేసినవి; ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత.
17. ఆ ప్రజలు పెద్దకేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని వినిపాళెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా
18. అతడు అది జయధ్వనికాదు, అపజయ ధ్వనికాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను.
19. అతడు పాళెమునకు సమీపింపగా, ఆ దూడను, వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను; అతడు కొండదిగువను తన చేతులలోనుండి ఆ పలకలను పడవేసి వాటిని పగ
20. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసికొని అగ్నితో కాల్చి పొడిచేసి నీళ్లమీద చల్లి ఇశ్రాయేలీయులచేత దాని త్రాగించెను.
21. అప్పుడు మోషేనీవు ఈ ప్రజలమీదికి ఈ గొప్ప పాపము రప్పించునట్లు వారు నిన్ను ఏమిచేసిరని అహరోనును నడుగగా
22. అహరోను నా యేలినవాడా, నీ కోపము మండనియ్యకుము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు.
23. వారుమాకు ముందునడుచుటకు ఒక దేవతను చేయుము; ఐగుప్తులోనుండి మమ్మును రప్పించినవాడగు ఈ మోషే యేమాయెనో మాకు తెలియదనిరి.
24. అందుకు నేనుఎవరియొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పితిని. నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ యాయెననెను.
25. ప్రజలు విచ్చల విడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరు గుటకు వారిని విడిచి పెట్టి యుండెను.
26. అందుకు మోషే పాళెముయొక్క ద్వార మున నిలిచియెహోవా పక్షమున నున్న వారందరు నాయొద్దకు రండి అనగా లేవీయులందరును అతని యొద్దకు కూడి వచ్చిరి.
27. అతడు వారిని చూచిమీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాళెములో ద్వారమునుండి ద్వారమునకు వెళ్లుచు, ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెలికానిని ప్రతివాడు తన
28. లేవీయులు మోషే మాటచొప్పున చేయగా, ఆ దినమున ప్రజలలో ఇంచుమించు మూడువేలమంది కూలిరి.
29. ఏలయనగా మోషే వారిని చూచినేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించునట్లు మీలో ప్రతివాడు తన కుమారునిమీద పడియేగాని తన సహోదరునిమీద పడియేగాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసి కొనుడనెను.
30. మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవాయొద్దకు కొండ యెక్కి వెళ్లెదను; ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను.
31. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లి అయ్యో యీ ప్రజలు గొప్ప పాపము చేసిరి; వారు బంగారు దేవతను తమకొరకు చేసికొనిరి.
32. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించి తివా, లేనియెడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలుకొనుచున్నాన నెను.
33. అందుకు యెహోవాయెవడు నా యెదుట పాపము చేసెనో వాని నా గ్రంథములోనుండి తుడిచి వేయుదును.
34. కాబట్టి నీవు వెళ్లి నేను నీతో చెప్పినచోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్లును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించెదనని మోషేతో చెప్పెను.
35. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధపెట్టెను.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 33
1. మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవును నీవు ఐగుప్తుదేశమునుండి తోడుకొనివచ్చిన ప్రజలును బయలుదేరి, నేను అబ్రాహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణముచేసినీ సంతానమునకు దీని నిచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపొండి.
2. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీ యులను అమోరీయులను హిత్తీయులను పెరిజ్జీయులను హివ్వీయులను యెబూసీయులను వెళ్లగొట్టెదను.
3. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడ రాను; త్రోవలో మిమ్మును సంహరించెద నేమో అని మోషేతో చెప్పెను.
4. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి; ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు.
5. కాగా యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ఇశ్రాయేలీయులతోమీరు లోబడనొల్లని ప్రజలు; ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా, మిమ్మును నిర్మూలము చేసెదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియు నట్లు మీ ఆభరణములను మీ మీదనుండి తీసివేయుడి అని చెప్పుమనెను.
6. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండయొద్ద తమ ఆభరణములను తీసివేసిరి.
7. అంతట మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్లి పాళెమునకు దూరముగా దాని వేసి, దానికి ప్రత్యక్షపు గుడారమను పేరు పెట్టెను. యెహోవాను వెదకిన ప్రతివాడును పాళెమునకు వె
8. మోషే ఆ గుడారమునకు వెళ్లినప్పుడు ప్రజలందరును లేచి, ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి, అతడు ఆ గుడారము లోనికి పోవువరకు అతని వెనుకతట్టు నిదానించి చూచు చుండెను.
9. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాటలాడుచుండెను.
10. ప్రజలందరు ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుటచూచి, లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి.
11. మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను ¸°వనస్థుడు గుడారములోనుండి వెలుపలికి రాలేదు.
12. మోషే యెహోవాతో ఇట్లనెనుచూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవునేను నీ పేరునుబట్టి నిన్ను ఎరిగియున్నాననియు, నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా.
13. కాబట్టి నీ కటాక్షము నా యెడల కలిగిన యెడల నీ కటాక్షము నాయెడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలిసికొందును; చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలేగదా అనెను.
14. అందుకు ఆయననా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదననగా
15. మోషేనీ సన్నిధి రానియెడల ఇక్కడనుండి మమ్మును తోడుకొని పోకుము.
16. నాయెడలను నీ ప్రజలయెడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుటవలననే గదా? అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలును భూమిమీదనున్న సమస్త ప్రజలలోనుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను.
17. కాగా యెహోవానీవు చెప్పిన మాటచొప్పున చేసె దను; నీమీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరునుబట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా
18. అతడుదయచేసి నీ మహిమను నాకు చూపుమనగా
19. ఆయననా మంచితనమంతయు నీ యెదుట కను పరచెదను; యెహోవా అను నామమును నీ యెదుట ప్రకటించెదను. నేను కరు ణించువాని కరుణించెదను, ఎవనియందు కనికరపడెదనో వానియందు కనికరపడెదననెను.
20. మరియు ఆయననీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడనెను.
21. మరియు యెహోవాఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండమీద నిలువవలెను.
22. నా మహిమ నిన్ను దాటి వెళ్లుచుండగా ఆ బండసందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్లువరకు నా చేతితో నిన్ను కప్పెదను;
23. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు కాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 34
1. మరియు యెహోవా మోషేతోమొదటి పలకల వంటి మరి రెండు రాతిపలకలను చెక్కుము. నీవు పగుల గొట్టిన మొదటి పలకలమీదనున్న వాక్యములను నేను ఈ పలకలమీద వ్రాసెదను.
2. ఉదయము నకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండయెక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచియుండవలెను.
3. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు; ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడనైనను కనబడకూడదు; ఈ కొండయెదుట గొఱ్ఱలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను.
4. కాబట్టి అతడు మొదటి పలకలవంటి రెండు రాతిపలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ రెండు రాతిపలకలను చేతపట్టుకొని సీనాయికొండ యెక్కగా
5. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను.
6. అతనియెదుట యెహోవా అతని దాటి వెళ్లుచుయెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా.
7. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించు నని ప్రకటించెను.
8. అందుకు మోషే త్వరపడి నేలవరకు తలవంచుకొని నమస్కారముచేసి
9. ప్రభువా, నామీద నీకు కటాక్షము కలిగినయెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యను ఉండి మాతోకూడ రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు, మా దోషమును పాపమున
10. అందుకు ఆయనఇదిగో నేను ఒక నిబంధన చేయు చున్నాను; భూమిమీద ఎక్కడనైనను ఏజనములో నైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరియెదుట చేసెదను. నీవు ఏ ప్రజల నడువ
11. నేడు నేను నీ కాజ్ఞా పించుదానిననుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీ యులను కనానీయులను హిత్తీ యులను పెరిజ్జీయులను హివ్వీయులను యెబూసీయులను నీ యెదుటనుండి వెళ్ల గొట్టెదను.
12. నీవు ఎక్కడికి వెళ్లుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసికొనకుండ జాగ్రత్తపడుము. ఒకవేళ అది నీకు ఉరికావచ్చును.
13. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను.
14. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషముగల యెహోవా; ఆయన రోషముగల దేవుడు.
15. ఆ దేశపు నివాసులతో నిబంధనచేసికొనకుండ జాగ్రత్త పడుము; వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన యెడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండ చూచుకొనుము.
16. మరియు నీవు నీ కుమారులకొరకు వారి కుమా ర్తెలను పుచ్చుకొనునెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో.
17. పోతపోసిన దేవతలను చేసికొనవలదు.
18. మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబునెలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగనివాటినే తినవలెను. ఏలయనగా ఆబీబు నెలలో ఐగుప్తులోనుండి మీరు బయలుదేరి వచ్చితిరి.
19. ప్రతి తొలిచూలు పిల్లయు నాది. నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగది దూడయే గాని గొఱ్ఱ పిల్లయేగాని అది నాదగును
20. గొఱ్ఱపిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపింపవలెను, దాని విమోచింపనియెడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో ప్రతి తొలిచూలువాని విడిపింపవలెను, నా సన్నిధిని వారు పట్టిచేతులతో కనబడవలదు.
21. ఆరు దినములు నీవు పనిచేసి యేడవ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోయుకాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను.
22. మరియు నీవు గోధుమలకోతలో ప్రథమ ఫలముల పండుగను, అనగా వారముల పండుగను సంవత్స రాంతమందు పంటకూర్చు పండుగను ఆచరింపవలెను.
23. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరు ప్రభువును ఇశ్రాయేలీయుల దేవుడు నైన యెహోవా సన్నిధిని కన బడవలెను
24. ఏలయనగా నీ యెదుటనుండి జనములను వెళ్లగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసెదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడును నీ భూమిని ఆశిం పడు.
25. నీవు పులిసినదానితో నా బలిరక్తమును అర్పింప కూడదు; పస్కాపండుగలోని బలిసంబంధమైన మాంసమును ఉదయకాలమువరకు ఉంచకూడదు.
26. నీ భూమి యొక్క ప్రథమఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్ట కూడదనెను.
27. మరియు యెహోవా మోషేతో ఇట్లనెనుఈ వాక్యములను వ్రాసికొనుము; ఏలయనగా ఈ వాక్యములనుబట్టి నేను నీతోను ఇశ్రాయేలీయులతోను నిబంధన చేసియున్నాను.
28. అతడు నలుబది రేయింబగళ్లు యెహోవాతో కూడ అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు; అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకలమీద
29. మోషే సీనాయికొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్న ప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి యుండలేదు.
30. అహరోనును ఇశ్రాయేలీయులందరును మోషేను చూచినప్పుడు అతని ముఖచర్మము ప్రకా శించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి.
31. మోషేవారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరును అతని యొద్దకు తిరిగి వచ్చిరి, మోషే వారితో మాట లాడెను.
32. అటుతరువాత ఇశ్రాయేలీయులందరు సమీ పింపగా సీనాయికొండమీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారి కాజ్ఞాపించెను.
33. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుకు వేసికొనెను.
34. అయినను మోషే యెహోవాతో మాటలాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చు వరకు ఆ ముసుకు తీసివేసెను; అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన
35. మోషే ముఖచర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి; మోషే ఆయనతో మాటలాడుటకు లోపలికి వెళ్లువరకు తన ముఖముమీద ముసుకు వేసికొనెను.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 35
1. మోషే ఇశ్రాయేలీయుల సర్వసమాజమును పోగుచేసిమీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధు లేవనగా
2. ఆరు దినములు పనిచేయవలెను; ఏడవది మీకు పరిశుద్ధదినము. అది యెహోవా విశ్రాంతిదినము; దానిలో పనిచేయు ప్రతివాడును మరణ శిక్షనొందును.
3. విశ్రాంతి దినమున మీరు మీ యిండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్ట కూడదని వారితో చెప్పెను.
4. మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వసమాజ ముతో ఇట్లనెనుయెహోవా ఆజ్ఞాపించినదేమనగా
5. మీరు మీలోనుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధిపుట్టిన ప్రతివాడు యెహోవా సేవనిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి,
6. నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్ననార మేకవెండ్రుకలు, ఎఱ్ఱరంగువేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱ,
7. ప్రదీపమునకు తైలము,
8. అభిషేకతైలమునకును పరిమళ ద్రవ్య ధూపమునకును సుగంధ సంభారములు,
9. ఏఫోదుకును పతకమునకును లేత పచ్చలును చెక్కు రత్నములును తీసికొని రావలెను.
10. మరియు వివేక హృదయులందరు వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నియు చేయవలెను.
11. అవేవనగా మందిరము దాని గుడారము దాని పైకప్పు దాని కొలుకులు దాని పలకలు దాని అడ్డకఱ్ఱలు దాని స్తంభములు దాని దిమ్మలు.
12. మందసము దాని మోతకఱ్ఱలు, కరుణా పీఠము కప్పు తెర,
13. బల్ల దాని మోతకఱ్ఱలు దాని ఉపకరణములన్నియు, సన్నిధి రొట్టెలు,
14. వెలుగుకొఱకు దీపవృక్షము దాని ఉపకరణములు దాని ప్రదీపములు, దీపములకు తైలము
15. ధూపవేదిక దాని మోతకఱ్ఱలు, అభిషేకతైలము పరిమళద్రవ్య సంభారము, మందిర ద్వార మున ద్వారమునకు తెర.
16. దహన బలిపీఠము దానికి కలిగిన ఇత్తడి జల్లెడ దాని మోతకఱ్ఱలు దాని యుపకరణములన్నియు, గంగాళము దాని పీట
17. ఆవరణపు తెరలు దాని స్తంభములు వాటి దిమ్మలు ఆవరణ ద్వారమునకు తెర
18. మందిరమునకు మేకులు ఆవరణమునకు మేకులు వాటికి త్రాళ్లు
19. పరిశుద్ధస్థలములో సేవచేయుటకు సేవావస్త్రములు, అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్ర ములు యాజకులగునట్లు అతని కుమారులకును వస్త్రములు నవియే అనెను.
20. ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే ఎదుటనుండి వెడలిపోయెను.
21. తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరు వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క పనికొరకును దాని సమస్త సేవకొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి.
22. స్త్రీలుగాని పురుషులుగాని యెవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరు యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను తావళ ములను, సమస్తవిధమైన బంగారు వస్తువులనుతెచ్చిరి.
23. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార, మేక వెండ్రుకలు, ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, వీటిలో ఏవి యెవరి యొద్ద నుండెనో వారు వాటిని తెచ్చిరి.
24. వెండిగాని యిత్తడిగాని ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకఱ్ఱ యెవని యొద్దనుండెనో వాడు దాని తెచ్చెను.
25. మరియు వివేక హృదయముగల స్త్రీలందరు తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలును సన్ననార నూలును తెచ్చిరి.
26. ఏ స్త్రీలు జ్ఞానహృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరు మేక వెండ్రుకలనువడికిరి.
27. ప్రధానులు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములను లేతపచ్చలను
28. సుగంధద్రవ్యమును, దీపమునకును అభిషేక తైలమునకును పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి.
29. మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరు మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి.
30. మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను చూడుడి;
31. యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును పేరుపెట్టి పిలిచి విచిత్ర మైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును,
32. రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును,
33. విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియు న్నాడు.
34. అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలీ యాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను.
35. చెక్కువాడేమి చిత్రకారుడేమి నీలధూమ్ర రక్తవర్ణముల తోను సన్ననారతోను బుటాపనిచేయువాడేమి నేతగాడేమి చేయు సమస్తవిధములైన పనులు, అనగా ఏ పని యైనను చేయువారియొక్కయు విచిత్రమైన పని కల్పించు వారియొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 36
1. పరిశుద్ధస్థలముయొక్క సేవనిమిత్తము ప్రతివిధమైన పనిచేయ తెలిసికొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞావివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలును అహోలీయాబును మొదలైన ప్రజ్ఞావంతులందరును యెహోవా ఆజ్ఞాపించిన అంతటిచొప్పున చేయుదురనెను.
2. బెసలేలును అహోలీ యాబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో వారి నందరిని మోషే పిలిపించెను.
3. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధస్థలముయొక్క సేవకొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నిటిని మోషేయొద్ద నుండి తీసికొనిరి. అయినను ఇశ్రాయేలీయులు ఇంక ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చు చుండిరి.
4. అప్పుడు పరిశుద్ధస్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయుపని విడిచివచ్చి
5. మోషేతోచేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవకొరకు ప్రజలు కావలసిన దానికంటె బహు విస్తారము తీసికొని వచ్చుచున్నారని చెప్పగా
6. మోషేపరిశుద్ధస్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీయైనను ఇకమీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించెను గనుక పాళె మందంతటను ఆ మాట చాటించిరి; ఆ పని అంతయు చేయునట్లు దానికొరకు వారు తెచ్చిన సామగ్రి చాలినది, అది అత్యధికమైనది
7. గనుక ప్రజలు తీసికొనివచ్చుట మానిరి.
8. ఆ పని చేసినవారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును పది తెరలతో చేసెను. అతడు వాటిని నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో చిత్రకారుని పనియైన కెరూబులు గలవాటినిగా చేసెను.
9. ప్రతి తెరపొడుగు ఇరువది యెనిమిది మూరలు; ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు; ఆ తెరలన్నిటి కొలత ఒక్కటే.
10. అయిదు తెరలను ఒక దానితో ఒకటి కూర్చెను; మిగిలిన అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను.
11. మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలినూలుతో కొలుకులను చేసెను. రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసెను.
12. ఒక తెరలో ఏబది కొలుకులను చేసెను, రెండవ కూర్పునున్న తెర అంచున ఏబదికొలుకులను చేసెను. ఈ కొలుకులు ఒక దానితో ఒకటి సరిగా నుండెను.
13. మరియు అతడు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీలచేత ఆ తెరలను ఒక దానితో ఒకటి కూర్పగా అది ఒక్క మందిరముగా ఉండెను.
14. మరియు మందిరముమీద గుడారముగా మేకవెండ్రుక లతో తెరలను చేసెను; వాటిని పదకొండు తెరలనుగాచేసెను.
15. ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగుమూరలు;
16. ఆ పదకొండు తెరల కొలత ఒక్కటే. అయిదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను కూర్చెను.
17. మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున ఏబదికొలుకులను చేసెను. మరియు రెండవ కూర్పునందలి వెలుపటి తెర అంచున ఏబది కొలుకు లను చేసెను.
18. ఆ గుడారము ఒక్కటిగా నుండునట్లు దాని కూర్చుటకు ఏబది యిత్తడి గుండీలను చేసెను.
19. మరియు ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేసెను.
20. మరియు అతడు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేసెను.
21. పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర.
22. ప్రతి పలకకు ఒకదాని కొకటి సమదూరముగల కుసులు రెండు ఉండెను. అట్లు మంది రముయొక్క పలకలన్నిటికి చేసెను.
23. కుడివైపున, అనగా దక్షిణ దిక్కున ఇరువది పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను.
24. ఒక్కొక్క పలక క్రింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను, ఆ యిరువది పలకల క్రింద నలుబది వెండి దిమ్మలను చేసెను.
25. మందిరముయొక్క రెండవ ప్రక్కకు, అనగా ఉత్తర దిక్కున ఇరువది పలకలను వాటి నలుబది వెండి దిమ్మలను,
26. అనగా ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలను ఒక పలక క్రింద రెండు దిమ్మ లను చేసెను.
27. పడమటి దిక్కున మందిరముయొక్క వెనుక ప్రక్కను ఆరు పలకలు చేసెను.
28. వెనుకప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేసెను.
29. అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరముదాక ఒక దానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి. అట్లు రెండు మూలలలో ఆ రెండు పలకలు చేసెను.
30. ఎనిమిది పలక లుండెను; వాటి వెండి దిమ్మలు పదునారు దిమ్మలు; ప్రతి పలక క్రింద రెండు దిమ్మలుండెను.
31. మరియు అతడు తుమ్మ కఱ్ఱతో అడ్డకఱ్ఱలను చేసెను. మందిరముయొక్క ఒకప్రక్క పలకకు అయిదు అడ్డ కఱ్ఱలను
32. మందిరముయొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలను, పడమటివైపున మందిరము యొక్క వెనుక ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలను చేసెను.
33. పలకల మధ్యనుండు నడిమి అడ్డకఱ్ఱను ఈ కొననుండి ఆ కొనవరకు చేరియుండ చేసెను.
34. ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకఱ్ఱలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డ కఱ్ఱలకు బంగారు రేకులను పొదిగించెను.
35. మరియు అతడు నీల ధూమ్ర రక్తవర్ణములుగల అడ్డతెరను పేనిన సన్ననారతో చేసెను, చిత్రకారునిపనియైన కెరూబులుగలదానిగా దాని చేసెను.
36. దాని కొరకు తుమ్మకఱ్ఱతో నాలుగు స్తంభములనుచేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. వాటి వంకులు బంగారువి, వాటికొరకు నాలుగు వెండి దిమ్మలను పోతపోసెను.
37. మరియు అతడు గుడారపు ద్వారముకొరకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో బుటా పనియైన అడ్డ తెరను చేసెను.
38. దాని అయిదు స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోదెలకును వాటి పెండె బద్దలకును బంగారు రేకులను పొదిగించెను; వాటి అయిదు దిమ్మలు ఇత్తడివి.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 37
1. మరియు బెసలేలు తుమ్మకఱ్ఱతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు రెండు మూరలనర దాని వెడల్పు మూరెడునర దాని యెత్తు మూరెడునర.
2. లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేసెను.
3. దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి, ఒక ప్రక్కను రెండు ఉంగరములును ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములుండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించెను.
4. మరియు అతడు తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులను పొది గించి
5. మందసమును మోయుటకు దాని ప్రక్కలమీది ఉంగరములలో ఆ మోతకఱ్ఱలను చొనిపెను.
6. మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసెను. దాని పొడుగు రెండు మూరలనర దాని వెడల్పు మూరెడునర;
7. మరియు రెండు బంగారు కెరూబులను చేసెను, కరుణాపీఠముయొక్క రెండు కొనలను వాటిని నకిషిపనిగా చేసెను.
8. ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని రెండు కొనలమీద కెరూబులను చేసెను.
9. ఆ కెరూబులు పైకివిప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను. కెరూబుల ముఖములు ఒక దానికి ఒకటి ఎదురుగా ఉండెను; వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా నుండెను.
10. మరియు అతడు తుమ్మకఱ్ఱతో బల్లను చేసెను. దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు మూరెడు దాని యెత్తు మూరెడునర.
11. అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేసెను;
12. దానికి చుట్టు బెత్తెడు బద్దెచేసి దాని బద్దెపైని చుట్టు బంగారు జవను చేసెను.
13. దానికి నాలుగు బంగారు ఉంగ రములను పోతపోసి దాని నాలుగు కాళ్లకుండిన నాలుగు మూలలయందు ఆ ఉంగరములను వేసెను.
14. బల్లను మోయు టకు మోతకఱ్ఱ లుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీ పముగా నుండెను.
15. బల్లను మోయుటకు తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను.
16. మరియు నతడు బల్లమీదనుండు దాని ఉపకరణములను, అనగా దాని గంగాళములను దాని ధూపకలశములను దాని గిన్నెలను తర్పణము చేయుటకు దాని పాత్రలనుమేలిమి బంగారుతో చేసెను.
17. అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును దాని ప్రకాండమును దాని కొమ్మను నకిషిపనిగా చేసెను. దాని కలశములు మొగ్గలు పువ్వులు ఏకాండమైనవి.
18. దీపవృక్షము యొక్క ఇరు ప్రక్కలనుండి మూడేసికొమ్మలు అట్లు దాని ప్రక్కలనుండి ఆరు కొమ్మలు బయలుదేరినవి.
19. ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులుగల బాదము రూపమైన మూడు కలశములు, రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వులుగల బాదమురూపమైన మూడు కలశములు; అట్లు దీపవృక్షమునుండి బయలుదేరిన ఆరు కొమ్మలకు ఉండెను.
20. మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు దాని పువ్వులుగల బాదమురూపమైన నాలుగు కలశము లుండెను.
21. దీపవృక్షమునుండి బయలుదేరు ఆరు కొమ్మలలో రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన మొగ్గయు నుండెను.
22. వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమైనవి; అదంతయు ఏకాండమైనదై మేలిమి బంగారుతో నకిషిపనిగా చేయబడెను.
23. మరియు అతడు దాని యేడు ప్రదీపములను దాని కత్తెరను దాని పట్టుకారును దాని కత్తెరచిప్పను మేలిమి బంగారుతో చేసెను.
24. దానిని దాని ఉపకరణములన్నిటిని నలుబది వీసెల మేలిమి బంగారుతో చేసెను.
25. మరియు అతడు తుమ్మకఱ్ఱతో ధూపవేదికను చేసెను. దాని పొడుగు మూరెడు దాని వెడల్పు మూరెడు, అది చచ్చౌకముగా నుండెను. దాని యెత్తు రెండు మూరలు దాని కొమ్ములు ఏకాండమైనవి.
26. దానికి, అనగా దాని కప్పుకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేసెను.
27. దాని మోయు మోతకఱ్ఱలకు స్థలములుగా దానికి రెండు ఉంగరములను బంగారుతో చేసి దానిరెండు ప్రక్కలయందు దాని రెండు మూలలయందు దాని జవకు దిగువను వాటిని వేసెను.
28. దాని మోత కఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను.
29. అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకునిచేత చేయించెను.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 38
1. మరియు అతడు తుమ్మకఱ్ఱతో దహనబలిపీఠమును చేసెను. దాని పొడుగు అయిదు మూరలు దాని వెడల్పు అయిదు మూరలు, అది చచ్చౌకమైనది. దాని యెత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను కొమ్ములను చేసెను.
2. దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి; దానికి ఇత్తడిరేకు పొదిగించెను.
3. అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్ని టిని, అనగా దాని బిందెలను దాని గరిటె లను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నిటిని ఇత్తడితో చేసెను
4. ఆ బలిపీఠము నిమిత్తము దాని జవక్రింద దాని నడిమివరకు లోతుగానున్న వలవంటి ఇత్తడి జల్లెడను చేసెను.
5. మరియు అతడు ఆ యిత్తడి జల్లెడయొక్క నాలుగు మూలలలో దాని మోతకఱ్ఱలుండు నాలుగు ఉంగరములను పోతపోసెను.
6. ఆ మోతకఱ్ఱలను తుమ్మ కఱ్ఱతో చేసి వాటికి రాగిరేకులు పొదిగించెను.
7. ఆ బలి పీఠమును మోయుటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆమోతకఱ్ఱలు చొనిపెను; పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను.
8. అతడు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళ మును దాని ఇత్తడి పీటను చేసెను.
9. మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపున, అనగా దక్షిణ దిక్కున నూరు మూరల పొడుగు గలవియు పేనినసన్ననారవియునైన తెరలుండెను.
10. వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది. ఆ స్తంభముల వంకులును వాటి పెండె బద్దలును వెండివి.
11. ఉత్తర దిక్కున నున్న తెరలు నూరు మూరలవి; వాటి స్తంభములు ఇరువది, వాటి యిత్తడి దిమ్మలు ఇరువది, ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.
12. పడమటి దిక్కున తెరలు ఏబది మూరలవి; వాటి స్తంభములు పది, వాటి దిమ్మలు పది, ఆ స్తంభముల వంకులును వాటి పెండె బద్దలును వెండివి.
13. తూర్పువైపున, అనగా ఉదయపు దిక్కున ఏబది మూరలు;
14. ద్వారముయొక్క ఒక ప్రక్కను తెరలు పదునైదు మూరలవి; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.
15. అట్లు రెండవ ప్రక్కను, అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు పదునైదు మూరల తెరలు ఉండెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.
16. ఆవరణము చుట్టునున్నదాని తెరలన్నియు పేనిన సన్ననారవి.
17. స్తంభముల దిమ్మలు రాగివి, స్తంభముల వంకులును వాటి పెండె బద్దలును వెండివి. వాటి బోదెలకు వెండిరేకులు పొదిగింపబడెను. ఆవరణపు స్తంభములన్నియు వెండి బద్దలతో కూర్ప బడెను.
18. ఆవరణ ద్వారపు తెర నీల ధూమ్ర రక్తవర్ణములు గలదియు పేనిన సన్ననారతో చేయబడి నదియునైన బుటాపనిది. దాని పొడుగు ఇరువది మూరలు; దాని యెత్తు, అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా, అయిదు మూరలు.
19. వాటి స్తంభములు నాలుగు, వాటి ఇత్తడి దిమ్మలు నాలుగు. వాటి వంకులు వెండివి.
20. వాటి బోదెలకు వెండిరేకు పొదిగింప బడెను, వాటి పెండె బద్దలు వెండివి, మందిరమునకును దాని చుట్టునున్న ఆవరణమునకును చేయబడిన మేకు లన్నియు ఇత్తడివి.
21. మందిరపదార్థముల మొత్తము, అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీయులచేత మోషే మాటచొప్పున లెక్క పెట్టించెను.
22. యూదా గోత్రికుడైన హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయుచేసెను.
23. దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలీయాబు అతనికి తోడైయుండెను. ఇతడు చెక్కువాడును విచిత్ర మైనపని కల్పించువాడును నీల ధూమ్ర రక్తవర్ణములతోను సన్ననారతోను బుటాపని చేయువాడునై యుండెను.
24. పరిశుద్ధస్థలవిషయమైన పని అంతటిలోను పని కొరకు వ్యయపరచబడిన బంగారమంతయు, అనగా ప్రతిష్ఠింప బడిన బంగారు పరిశుద్ధస్థలపు తులము చొప్పున నూట పదహారుమణుగుల ఐదువందల ముప్పది తులములు.
25. సమాజ ములో చేరినవారి వెండి పరిశుద్ధస్థలపు తులముచొప్పున నాలుగువందల మణుగుల వెయ్యిన్ని ఐదువందల డెబ్బదియైదు తులములు.
26. ఈ పన్ను ఇరువది ఏండ్లు మొదలు కొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో, అనగా ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబది మందిలో తలకొకటికి అరతులము.
27. ఆ నాలుగువందల వెండి మణు గులతో పరిశుద్ధస్థలమునకు దిమ్మలు అడ్డతెరకు దిమ్మలును; అనగా ఒక దిమ్మకు నాలుగు మణుగుల చొప్పున నాలుగు వందల మణుగులకు నూరు దిమ్మలు పోతపోయబడెను.
28. వెయ్యిన్ని ఐదువందల డెబ్బది యైదు తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోదెలకు పొదిగించి వాటిని పెండె బద్దలచేత కట్టెను.
29. మరియు ప్రతిష్ఠింపబడిన యిత్తడి రెండువందల ఎనుబది మణుగుల రెండువేల నాలుగువందల తులములు.
30. అతడు దానితో ప్రత్యక్షపు గుడారపు ద్వారమునకు దిమ్మలను ఇత్తడి వేదికను దానికి ఇత్తడి జల్లెడను వేదిక ఉపకరణములన్నిటిని
31. చుట్టునున్న ఆవరణమునకు దిమ్మలను ఆవరణద్వారమునకు దిమ్మలను ఆలయమునకు మేకులన్నిటిని చుట్టునున్నఆవరణ మునకు మేకులన్నిటిని చేసెను.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 39
1. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధస్థలములో అహరోను చేయు సేవనిమిత్తము నీల ధూమ్ర రక్తవర్ణములుగల సేవావస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్ర ములను కుట్టిరి.
2. మరియు అతడు బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములుగల నూలుతోను పేనిన సన్ననారతోను ఏఫోదును చేసెను.
3. నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలుతోను సన్ననారతోను చిత్రకారుని పనిగా నేయుటకు బంగారును రేకులుగా కొట్టి అది తీగెలుగా కత్తిరించిరి.
4. దానికి కూర్చు భుజఖండములను చేసిరి, దాని రెండు అంచులయందు అవి కూర్పబడెను.
5. దానిమీదనున్న దాని విచిత్రమైన దట్టి యేకాండమై దానితో సమమైన పని గలిగి బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతోను చేయబడెను; అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.
6. మరియు బంగారు జవలలో పొదిగిన లేతపచ్చలను సిద్ధ పరచిరి. ముద్రలు చెక్కబడునట్లు ఇశ్రాయేలీయుల పేళ్లు వాటిమీద చెక్కబడెను.
7. అవి ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములగునట్లు ఏఫోదు భుజములమీద వాటిని ఉంచెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.
8. మరియు అతడు ఏఫోదుపనివలె బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల పంక్తులతోను సన్ననార తోను చిత్రకారునిపనిగా పతకమును చేసెను.
9. అది చచ్చౌకముగా నుండెను. ఆ పతకమును మడతగా చేసిరి. అది మడవబడినదై జేనెడు పొడుగు జేనెడు వెడల్పుగలది.
10. వారు దానిలో నాలుగు పంక్తుల రత్నములను పొదిగిరి. మాణిక్య గోమేధిక మరకతములు గల పంక్తి మొదటిది;
11. పద్మరాగ నీల సూర్యకాంత మణులుగల పంక్తి రెండవది;
12. గారుత్మతకము యష్మురాయి ఇంద్రనీలమునుగల పంక్తి మూడ వది;
13. రక్తవర్ణ పురాయి సులిమానిరాయి సూర్యకాంతమును గల పంక్తి నాలుగవది; వాటివాటి పంక్తులలో అవి బంగారుజవలలో పొదిగింపబడెను.
14. ఆ రత్నములు ఇశ్రాయేలీ యుల పేళ్ల చొప్పున, పండ్రెండు ముద్రలవలె చెక్కబడిన వారి పేళ్ల చొప్పున, పండ్రెండు గోత్రముల పేళ్ళు ఒక్కొక్కదానిమీద ఒక్కొక్క పేరు చెక్కబడెను.
15. మరియు వారు ఆ పతకమునకు మేలిమి బంగారుతో అల్లికపనియైన గొలుసులు చేసిరి.
16. వారు రెండు బంగారు జవలు రెండు బంగారు ఉంగరములును చేసి ఆ రెండు ఉంగరములును పతకపు రెండు కొనలను ఉంచి
17. అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను పతకపు కొనలనున్న రెండు ఉంగరములలోవేసి
18. అల్లబడిన ఆ రెండు గొలుసుల కొనలను ఆ రెండుజవలకు తగిలించి ఏఫోదు భుజ ఖండములమీద దాని యెదుట ఉంచిరి.
19. మరియు వారు రెండు బంగారు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకపు లోపలి అంచున దాని రెండు కొనలకు వాటిని వేసిరి.
20. మరియు రెండు బంగారు ఉంగరములను చేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని రెండవ కూర్పు నొద్దనున్న దాని యెదుటి ప్రక్కను, ఏఫోదు రెండు భుజఖండములకు దిగువను వాటిని వేసిరి.
21. ఆ పత కము ఏఫోదు విచిత్రమైన దట్టికిపైగా నుండునట్లును అది ఏఫోదు నుండి విడిపోకుండునట్లును ఆ పతకమును దాని ఉంగరములకును ఏఫోదు ఉంగరములకును నీలిసూత్ర ముతో కట్టిరి. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.
22. మరియు అతడు ఏఫోదు చొక్కాయి కేవలము నీలి నూలుతో అల్లికపనిగా చేసెను. ఆ చొక్కాయి మధ్య నున్న రంధ్రము కవచరంధ్రమువలె ఉండెను.
23. అది చినుగకుండునట్లు దాని రంధ్రమునకు చుట్టు ఒక గోటు ఉండెను.
24. మరియు వారు చొక్కాయి అంచులమీద నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరి.
25. మరియు వారు మేలిమి బంగారుతో గంటలను చేసి ఆ దానిమ్మపండ్ల మధ్యను, అనగా ఆ చొక్కాయి అంచులమీద చుట్టునున్న దానిమ్మపండ్ల మధ్యను ఆ గంటలను పెట్టిరి.
26. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవచేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మపండును ఆ చొక్కాయి అంచులమీద చుట్టు ఉంచిరి.
27. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేతపనియైన సన్న నార చొక్కాయిలను సన్ననార పాగాను అందమైన
28. సన్ననార కుళ్లాయిలను పేనిన సన్ననార లాగులను
29. నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో బుటాపనియైన నడికట్టును చేసిరి.
30. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధకిరీట భూషణము చేసిచెక్కిన ముద్రవలె దానిమీదయెహోవా పరి శుద్ధుడు అను వ్రాత వ్రాసిరి.
31. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్లు దానికి నీలి సూత్రమును కట్టిరి.
32. ప్రత్యక్షపు గుడారపు మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీయులు చేసిరి.
33. అప్పుడు వారు మందిరమును గుడారమును దాని ఉప కరణములన్నిటిని దాని కొలుకులను, పలకలను, కమ్ములను, స్తంభములను, దిమ్మలను,
34. ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పును, సముద్రవత్సల తోళ్ల పైకప్పును, కప్పు తెరను,
35. సాక్ష్యపు మందసమును దాని మోత కఱ్ఱలను, కరుణాపీఠమును,
36. బల్లను, దాని ఉపకరణములన్నిటిని, సముఖపు రొట్టెలను,
37. పవిత్ర మైన దీపవృక్షమును, సవరించు దాని ప్రదీపములను, అనగా దాని ప్రదీపముల వరుసను దాని ఉపకరణములన్నిటిని దీపముకొరకు తైలమును
38. బంగారు వేదికను అభిషేక తైలమును పరిమళ ధూప ద్రవ్యములను శాలాద్వారమునకు తెరను
39. ఇత్తడి బలిపీఠమును దానికుండు ఇత్తడి జల్లెడను దాని మోతకఱ్ఱలను దాని ఉపకరణములన్నిటిని, గంగాళమును దాని పీటను
40. ఆవరణపు తెరలు దాని స్తంభములను దాని దిమ్మలను ఆవరణద్వారమునకు తెరను దాని త్రాళ్లను దాని మేకులను ప్రత్యక్షపు గుడారములో మందిర సేవకొరకైన ఉపకర ణములన్నిటిని, పరిశుద్ధస్థలములోని
41. యాజక సేవార్థమైన వస్త్రములను, అనగా యాజకుడైన అహరోనుకు పరిశుద్ధ వస్త్రములను అతని కుమారులకు వస్త్రములను మోషే యొద్దకు తీసికొని వచ్చిరి.
42. యెహోవా మోషేకు ఆజ్ఞా పించినట్లు ఇశ్రాయేలీ యులు ఆ పని అంతయు చేసిరి.
43. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసియుండిరి; ఆలాగుననే చేసియుండిరి గనుక మోషే వారిని దీవించెను.
నిర్గమకాండము (Exodus) చాప్టర్ 40
1. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను
2. మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను.
3. అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డ తెరతో కప్పవలెను.
4. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసినవాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను.
5. సాక్ష్యపు మందసము నెదుట ధూమము వేయు బంగారు వేదికను ఉంచి మందిరద్వారమునకు తెరను తగి లింపవలెను.
6. ప్రత్యక్షపు గుడారపు మందిరద్వారము నెదుట దహన బలిపీఠ మును ఉంచవలెను;
7. ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను.
8. తెరలచుట్టు ఆవరణమును నిలువబెట్టి ఆవరణద్వారముయొక్క తెరను తగిలింప వలెను.
9. మరియు నీవు అభిషేకతైలమును తీసికొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును.
10. దహన బలిపీఠమునకు అభిషేకముచేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను, అప్పుడు ఆ పీఠము అతిపరిశుద్ధ మగును.
11. ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకము చేసి దాని ప్రతిష్ఠింపవలెను.
12. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తోడుకొనివచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి
13. అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకముచేసి అతని ప్రతిష్ఠింపవలెను.
14. మరియు నీవు అతని కుమారులను తోడుకొనివచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి
15. వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికిని అభిషేకము చేయుము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండుననెను.
16. మోషే ఆ ప్రకారము చేసెను; యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటిని చేసెను, ఆలాగుననే చేసెను.
17. రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను.
18. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువ బెట్టి దాని దిమ్మలనువేసి దాని పలకలను నిలువబెట్టి దాని పెండె బద్దలను చొనిపి దాని స్తంభములను నిలువబెట్టి
19. మందిరముమీద గుడారమును పరచి దాని పైని గుడారపు కప్పును వేసెను.
20. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞా పించినట్లు అతడు శాసనములను తీసికొని మందసములో ఉంచి మందసమునకు మోతకఱ్ఱలను దూర్చి దానిమీద కరుణాపీఠము నుంచెను.
21. మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను.
22. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరముయొక్క ఉత్తర దిక్కున, అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి
23. యెహోవా సన్నిధిని దానిమీద రొట్టెలను క్రమముగా ఉంచెను.
24. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడుప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల యెదుట దీపవృక్షమును ఉంచి
25. యెహోవా సన్ని ధిని ప్రదీపములను వెలిగించెను.
26. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డ తెరయెదుట బంగారు ధూపవేదికను ఉంచి
27. దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను.
28. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహనబలిపీఠమును ఉంచి
29. దానిమీద దహనబలి నర్పించి నైవేద్యమును సమర్పించెను.
30. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాళ మును ఉంచి ప్రక్షాళణకొరకు దానిలో నీళ్లు పోసెను.
31. దానియొద్ద మోషేయు అహరోనును అతని కుమారులును తమ చేతులును కాళ్లును కడుగుకొనిరి.
32. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడున బలిపీఠమునకు సమీపించు నప్పుడును కడుగుకొనిరి.
33. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టు ఆవరణమును ఏర్పరచి ఆవరణద్వారపు తెరను వేసెను. ఆలాగున మోషే పని సంపూర్తి చేసెను.
34. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను.
35. ఆ మేఘము మందిరముమీద నిలుచుటచేత మందిరము యెహోవా తేజ స్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లలేకుండెను.
36. మేఘము మందిరముమీదనుండి పైకి వెళ్లునప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమై పోయిరి.
37. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘముపైకి వెళ్లనియెడల అది వెళ్లు దినమువరకు వారు ప్రయాణము చేయకుండిరి.
38. ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటివేళ యెహోవా మేఘము మందిరముమీద ఉండెను. రాత్రివేళ అగ్ని దానిమీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగెను.